ప్రేమిస్తోందని చెల్లెలిపై కాల్పులు జరిపిన అన్న

  • Published By: murthy ,Published On : November 21, 2020 / 01:30 PM IST
ప్రేమిస్తోందని చెల్లెలిపై కాల్పులు జరిపిన అన్న

Updated On : November 21, 2020 / 1:45 PM IST

delhi teen girl: బావ వరసయ్యే వ్యక్తిని ప్రేమిస్తోందని ….ఆ ప్రేమను అంగీకరించని అన్న సొంత చెల్లెలిపై కాల్పులు జరిపిన ఘటన ఢిల్లీలో జరిగింది. ఈశాన్యఢిల్లీలోని వెల్కమ్ ఏరియా, జంతా కాలనీకి చెందిన మైనర్ బాలికకి, వరుసకు బావ అయ్యే బాబర్ పూర్ కు చెందిన అమీర్ తో పరిచయం ఏర్పడింది. ఆపరిచయం క్రమేపి ప్రేమగా మారింది.




ఈ క్రమంలోనే ఇంట్లో వాళ్లకు తెలియకుండా తండ్రి మొబైల్ నుంచి అమీర్ తో తరచూ మాట్లాడుతూ ఉండేది. ఈ విషయాన్ని ఆమె అన్న గ్రహించాడు. అమీర్ తో మాట్లాడవద్దని చెల్లిని హెచ్చరించాడు. ఈవిషయమై ఇద్దరికీ పలుమార్లు గొడవ జరిగింది. అయినా కానీ చెల్లి అమీర్ తో మాట్లడటం మానకపోయేసరికి చెల్లెలిపై కక్ష పెంచుకున్నాడు.

ఈ క్రమంలో గురువారం ఉదయం బాలిక అమీర్ తో మాట్లాడటం గమనించిన అన్న ఇంట్లో ఉన్న దేశవాళి తుపాకీతో చెల్లెలిపై కాల్పులు జరిపాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు బాలికను వెంటనే జగ్ ప్రవీష్ చంద్ ఆస్పత్రికి తరలించిచికిత్సఅందిస్తున్నారు.




సమాచారం తెలుసుకుని ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు కాల్పులు జరిపిన తుపాకీని కొన్నిబుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.కాల్పులు జరిపిన బాధితురాలి సోదరుడిని అరెస్ట్ చేసినట్లు ఈశాన్య ఢిల్లీ డిప్యూటీ పోలీసు కమీషనర్ వేదప్రకాష్ సూర్య చెప్పారు.