బాబోయ్.. చెప్పులు బయట విడవమన్నందుకు డాక్టర్‌ని ఎంత దారుణంగా కొట్టారో.. షాకింగ్ వీడియో

ఈ ఘటన చూసి అంతా షాక్ కి గురవుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులోకి చెప్పులు వేసుకురావడమే తప్పు. అంతేకాకుండా డాక్టర్ ని కొట్టడం మరీ దారుణం అని మండిపడుతున్నారు.

బాబోయ్.. చెప్పులు బయట విడవమన్నందుకు డాక్టర్‌ని ఎంత దారుణంగా కొట్టారో.. షాకింగ్ వీడియో

Doctor Beaten (Photo Credit : Twitter)

Updated On : September 16, 2024 / 12:31 AM IST

Doctor Beaten Brutally : చిన్న చిన్న విషయాలకే మనుషులు నిగ్రహం కోల్పోతున్నారు. తీవ్రమైన కోపంతో, ఆగ్రహంతో ఊగిపోతూ ఉన్మాదుల్లా వ్యవహరిస్తున్నారు. నాలుగు మంచి మాటలు చెప్పడం కూడా తప్పైపోతోంది. నాకే చెబుతావా? అంటూ.. ఎదుటి వారిపై దాడులకు తెగబడుతున్నారు. తాజాగా.. ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి చెప్పులు ఎందుకు వేసుకొచ్చావని అడగటమే ఆ డాక్టర్ పాలిట పాపమైంది. తీవ్ర ఘర్షణకు దారితీసింది. కొందరు వ్యక్తులు డాక్టర్ ను అతి దారుణంగా కొట్టారు. నువ్వెవరు చెప్పడానికి అంటూ కిందపడేసి మరీ పిచ్చ కొట్టుడు కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గుజరాత్ లోని భావ్ నగర్ జిల్లా సిహోర్ లో ఈ ఘోరం జరిగింది. అదొక ప్రైవేట్ హాస్పిటల్. ఓ మహిళ ఆ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతోంది. ఆమెను చూసేందుకు కొందరు వ్యక్తులు వచ్చారు. సరిగ్గా అదే సమయానికి డాక్టర్ వచ్చాడు. ఆ వ్యక్తులు చెప్పులు వేసుకుని ఉండటం చూసిన డాక్టర్.. చెప్పులు బయట విడవాలని చెప్పాడు. ఎమర్జెన్సీ వార్డులు చెప్పులు ఎలా వేసుకొస్తావని ప్రశ్నించాడు. డాక్టర్ అలా అనడంతో ఆ వ్యక్తికి కోపం వచ్చింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అంతే, ఆ వ్యక్తి పట్టరాని కోపంతో ఊగిపోయాడు. డాక్టర్ పై చేయి చేసుకున్నాడు. ఇంతలో ఆ వ్యక్తితో వచ్చిన మరో ఇద్దరు వ్యక్తులు కూడా డాక్టర్ పై దాడి చేశారు. ముగ్గురూ కలిసి డాక్టర్ ను దారుణంగా కొట్టారు. డాక్టర్ కూడా తీవ్రంగా ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో ఎమర్జెన్సీ వార్డు రణరంగాన్ని తలపించిందని చెప్పాలి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఘటన చూసి అంతా షాక్ కి గురవుతున్నారు. ఎమర్జెన్సీ వార్డులోకి చెప్పులు వేసుకుని రావడమే తప్పు. అంతేకాకుండా డాక్టర్ ని కొట్టడం మరీ దారుణం అని మండిపడుతున్నారు. డాక్టర్ పై దాడికి పాల్పడ వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

”ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళను చూసేందుకు ముగ్గురు వ్యక్తులు ఎమర్జెన్సీ వార్డులోకి చెప్పులతో వచ్చారు. అదే సమయంలో డాక్టర్ అక్కడికి వచ్చారు. చెప్పులు బయటే విడవాలని చెప్పారు. దీనిపై వివాదం చెలరేగింది. ఆ వ్యక్తి డాక్టర్ తో గొడవకు దిగాడు. తిట్టడం ప్రారంభించాడు. మాట మాట పెరిగి దాడి చేసే వరకు వెళ్లింది. ఆసుపత్రి సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేసినా ఆ వ్యక్తులు ఆగలేదు. విచక్షణారహితంగా డాక్టర్ ను కొట్టారు” అని పోలీసులు తెలిపారు.

Also Read : తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు అంటూ హైదరాబాద్‌లో ఘరానా మోసం, రూ.700 కోట్లతో పరార్..!

కాగా, డాక్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దాడికి పాల్పడ్డ ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పలు సెక్షన్ల కింద వారిపై కేసులు నమోదు చేశారు. ఈ దాడిలో డాక్టర్ కు గాయాలయ్యాయి. వార్డులో మందులు, ఇతర వైద్య పరికరాలు డ్యామేజ్ అయ్యాయి. దీనిపై నెటిజన్లు నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. డాక్టర్ పై దాడి కరెక్ట్ కాదంటున్నారు. ఎమర్జెన్సీ వార్డులో చెప్పులు వేసుకు రావడమే తప్పు, పైగా డాక్టర్ పై దాడి చేయడం క్షమించరాని నేరం అంటున్నారు. ఇలాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.