Viral Video: భయంకర ఘటన.. మనిషి తల నోట్లో పెట్టుకుని నగర వీధుల్లో కుక్క పరుగులు

కొద్ది రోజులుగా జకాటెకాస్ ప్రాంతంలో డ్రగ్స్ మాఫియా మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక హత్యలు జరుగుతున్నాయి. తాజాగా రెండు గ్రూపుల మధ్య జరిగిన గన్ ఫైరింగులో 18 మంది చనిపోయారు. ఇందులో స్థానిక మాజీ మేయర్ కూడా ఉండడం గమనార్హం. వాస్తవానికి డ్రగ్స్ మాఫియాలో ప్రభుత్వానికి చెందిన ప్రస్తుత, మాజీ అధికారులు కూడా భాగమై ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.

Viral Video: భయంకర ఘటన.. మనిషి తల నోట్లో పెట్టుకుని నగర వీధుల్లో కుక్క పరుగులు

Dog runs with human head in its mouth in Mexico

Updated On : November 1, 2022 / 3:41 PM IST

Viral Video: నగర నడి వీధుల్లో ఒక కుక్క తన నోటిలో మనిషి తలను పెట్టుకుని పరుగెడుతూ కనిపించింది. ఇంత భయంకరమైన వీడియో మెక్సికోలోని జకాటెకాస్‭లో వెలుగు చూసింది. ఒక వ్యక్తి ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో దారుణం బయటి ప్రపంచానికి తెలిసింది. ఈ వీడియో ప్రకారం.. నోటి దవడకు మనిషి తల కరుచుకుని కుక్క పరుగెత్తడం స్పష్టంగా కనిపిస్తోంది.

అయితే సమాచారం అందుకున్న మెక్సికన్ పోలీసులు, కుక్కను పసిగట్టి, దాన్నుంచి మనిషి తలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జకాటెకాస్‭లో పలుప్రాంతాలు తీవ్ర భయాందోళనలో కూరుకుపోయాయి. నేరం జరిగిన ప్రాంతం నుంచి కుక్క ఆ తలను తీసుకువచ్చిందని, కాస్త ప్రశాంతమైన ప్రాంతానికి వెళ్లి తినాలని ప్రయత్నించినట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. వాస్తవానికి నేర సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకునే లోపే.. ఒక మనిషి తలను అక్కడి నుంచి కుక్క ఎత్తికెళ్లినట్లు స్థానికులు చెప్పినట్లు మెక్సికన్ మీడియా పేర్కొంది.

కొద్ది రోజులుగా జకాటెకాస్ ప్రాంతంలో డ్రగ్స్ మాఫియా మధ్య తీవ్ర ఘర్షణలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక హత్యలు జరుగుతున్నాయి. తాజాగా రెండు గ్రూపుల మధ్య జరిగిన గన్ ఫైరింగులో 18 మంది చనిపోయారు. ఇందులో స్థానిక మాజీ మేయర్ కూడా ఉండడం గమనార్హం. వాస్తవానికి డ్రగ్స్ మాఫియాలో ప్రభుత్వానికి చెందిన ప్రస్తుత, మాజీ అధికారులు కూడా భాగమై ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కాగా, చనిపోయిన వ్యక్తుల్లో ఒకరి తల తెగిపోయిందని, ఆ తలను కుక్క ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆ తల ఎవరిదనే విషయం మాత్రం ఇంకా వెల్లడికాలేదు. అలాగే మిగిలిన శరీరభాగం కూడా లభించలేదని పోలీసులు తెలిపారు.

Munugode Bypoll: మునుగోడు మండలం పలివెలలో ఉద్రిక్తత.. రాళ్లు, కర్రలతో దాడిచేసుకున్న టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు