ప్రియాంక హత్య కేసు : షాద్ నగర్ టూ చర్లపల్లి.. జైలులో నిందితులు

  • Published By: madhu ,Published On : November 30, 2019 / 12:38 PM IST
ప్రియాంక హత్య కేసు : షాద్ నగర్ టూ చర్లపల్లి.. జైలులో నిందితులు

Updated On : November 30, 2019 / 12:38 PM IST

అవే నిరసనలు..అదే ఆక్రోషం..అదే ఆవేదన..నిందితులను తమకు అప్పచెప్పండి..బహిరంగంగా వారికి శిక్ష వేస్తాం..లేదా..అందరి ముందు..ఉరి తీయండి..అంటూ డాక్టర్ ప్రియాంక అత్యాచారం, హత్య కేసులో చలించిపోయిన వారు డిమాండ్ చేస్తున్నారు.

షాద్ నగర్ పీఎస్ ఎదుట 2019, నవంబర్ 30వ తేదీ శనివారం..ఉదయం ఎలాంటి సీన్ ఉందో..అదే సీన్ చర్లపల్లి జైలు వద్ద రిపీట్ అయ్యింది. ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ప్రియాంక రేప్ అండ్ మర్డర్ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎంతో మందిని కదిలించి వేసింది. ఈ ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు సామాన్యుడి నుంచి రాజకీయ, సినీ, వివిధ రంగానికి చెందిన ప్రముఖులు.

ప్రియాంక హత్య కేసులో నిందితులను తరలిస్తున్న క్రమంలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. కీసర టోల్ ప్లాజా వద్ద ఇతర వెహికల్స్‌లను అనుమతించలేదు. కనీసం మీడియాకు నో ఎంట్రీ అన్నారు. దీంతో నిందితులను ఎక్కడకు తీసుకెళుతున్నారో తెలియ లేదు. మీడియా వాహనాలను ఎందుకు ఆపారని టోల్ ప్లాజా సిబ్బందిని ప్రశ్నించినా..వారు ఎలాంటి సమాధానం చెప్పలేదు. మొదట షాద్ నగర్ పీఎస్ నుంచి చంచల్ గూడ జైలుకు తరలిస్తారని ప్రచారం జరిగింది. కానీ అనూహ్యంగా పోలీసులు వ్యూహం మార్చారు. చర్లపల్లి జైలుకు రూటు మార్చారు. 

షాద్ నగర్ పీఎస్ వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో..చర్లపల్లి జైలు వద్ద కూడా అలాంటి సీన్ నెలకొని ఉంది. వాహనాన్ని అడ్డుకొనేందుకు ప్రయత్నించారు. ప్రజలు తరలి రావడంతో పోలీసులు భారీగానే మోహరించారు. భారీ సెక్యూర్టీ నడుమ వచ్చిన వాహనానికి ఎదురుగా వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని బలవంతంగా అడ్డుకున్నారు. విద్యార్థి, ప్రజా, మహిళా సంఘాలు నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టి…నిందితులను భారీ భద్రత నడుమ చర్లపల్లి జైలులోనికి తీసుకెళ్లారు. 
Read More : చంచల్ గూడ జైలుకు ప్రియాంక రెడ్డి హత్య కేసు నిందితులు