Road Accident One Died : ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి

ఉత్తరప్రదేశ్‌లో విషాదం నెలకొంది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ ఒకరి ప్రాణం తీసింది. ఓ వ్యక్తి మద్యం తాగి డ్రైవింగ్ చేయడంతో కారు ముగ్గురు చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందారు.

Road Accident One Died : ఉత్తరప్రదేశ్‌లో విషాదం.. చిన్నారులపైకి దూసుకెళ్లిన కారు, ఒకరు మృతి

road accident One died

Updated On : November 29, 2022 / 12:17 PM IST

Road Accident One Died : ఉత్తరప్రదేశ్‌లో విషాదం నెలకొంది. మద్యం మత్తులో కారు డ్రైవింగ్ ఒకరి ప్రాణం తీసింది. ఓ వ్యక్తి మద్యం తాగి డ్రైవింగ్ చేయడంతో కారు ముగ్గురు చిన్నారులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరేళ్ల చిన్నారి మృతి చెందారు. ఈ ఘటన నోయిడాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్‌ 45 సదాపూర్‌లో రియా, అను, అంకిత అనే ముగ్గురు అక్కచెల్లెల్లు.

ముగ్గురు అక్కచెల్లెల్లు పానీపూరీ తినేందుకు ఇంటి నుంచి బయటికి వెళ్లారు. రోడ్డు పక్కన ఉన్న పానీపూరీ బండి వద్ద గోల్‌గప్పా తింటున్నారు. అదే సమయంలో ఒక వ్యక్తి ఫుల్‌గా మద్యం తాగి వేగంగా కారు నడుపుతూ వారి వైపు వచ్చాడు. ఈ క్రమంలో కారు అదుపుతప్పి పానీపూరీ తింటున్న ముగ్గురు చిన్నారులపైకి దూసుకెళ్లింది. దీంతో ముగ్గురు అక్కచెల్లెల్లు తీవ్రంగా గాయపడ్డారు.

Nine Died In Road Accident : విహారయాత్రలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఐదుగురు విద్యార్థులు, టీచర్ సహా 9 మంది మృతి

స్థానికులు వెంటనే వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వీరిలో రియా (6) అనే చిన్నారి చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు పోలీసు అధికారి రాజీవ్‌ తెలిపారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు.