Chittoor Dead Body : ముళ్లపొదల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతదేహం.. పరువు హత్యగా అనుమానం

గడిచిన పది రోజులుగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్న హార్దిక, ఈ ఉదయం గ్రామ శివారులోని ముళ్లపొదల దగ్గర శవమై కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని..

Chittoor Dead Body : ముళ్లపొదల్లో ఇంజినీరింగ్ విద్యార్థిని మృతదేహం.. పరువు హత్యగా అనుమానం

Chittoor Dead Body

Updated On : January 24, 2022 / 6:37 PM IST

Chittoor Dead Body : చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం కృష్ణాపురం సమీపంలో హార్ధిక (19) అనే యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. పోలీసులు పరువు హత్యగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హార్ధిక మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతోంది. రెండు నెలల క్రితం బడికాయలపల్లికు చెందిన శ్రీనివాసులును హార్థిక ప్రేమించి పెళ్లి చేసుకుంది. కులాలు వేరు కావడంతో కుటుంబసభ్యులు ఈ జంటను వేరు చేశారు.

Watching TV : అధిక సమయం టీవీ చూసే అలవాటుందా?… అయితే జాగ్రత్త?

గడిచిన పది రోజులుగా తల్లిదండ్రుల దగ్గరే ఉంటున్న హార్దిక, ఈ ఉదయం గ్రామ శివారులోని ముళ్లపొదల దగ్గర శవమై కనిపించింది. రంగంలోకి దిగిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో హార్దిక మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. హార్థిక ఇంజనీరింగ్ ఫస్టియర్ చదువుతోంది.

Paneer : బరువు నియంత్రణకు దోహదపడే పన్నీర్..!

బైక్ నేర్చుకుంటాను అని నిన్న సాయంత్రం బైక్ తో వెళ్లిన హార్ధిక రాత్రంతా కనిపించలేదని ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. ఉదయం ఓ పొలం దగ్గర హార్దిక శవమై కనిపించిందన్నారు. ఓ యువకుడితో హార్దికకు ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. కొన్నిరోజుల క్రితం పెద్ద మనుషుల పంచాయతీతో ఆ వ్యవహారం సద్దుమణిగిందన్నారు. మనస్తాపం చెందిన హార్దిక.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నా.. ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.