ఈఎస్ఐ స్కామ్‌ : కస్టడీలోకి మరో నలుగురు

  • Published By: veegamteam ,Published On : October 12, 2019 / 03:16 PM IST
ఈఎస్ఐ స్కామ్‌ : కస్టడీలోకి మరో నలుగురు

Updated On : October 12, 2019 / 3:16 PM IST

ఈఎస్ఐ ఐఎమ్ఎస్ స్కామ్‌లో ఏసీబీ అధికారుల దర్యాప్తు వేగవంతం చేశారు. ఇప్పటికే ఈ కేసులో 16 మంది నిందితులను అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు.. మరో నలుగురు నిందితులను శనివారం (అక్టోబర్ 12, 2019) కస్టడీలోకి తీసుకున్నారు. లైఫ్ కేర్ ఎండీ సుధాకర్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ సురేంద్ర నాథ్ బాబు, వెంకటేశ్వర హెల్త్ సెంటర్ డాక్టర్ చెరుకు అరవింద్ రెడ్డి, నాచారం ఈఎస్ఐ ఆసుపత్రి ఫార్మసిస్ట్ నాగలక్ష్మిలను రెండు రోజుల కస్టడీకి అనుమతించింది సీబీఐ కోర్టు. దీంతో వీరిని కస్టడీకి తీసుకున్నారు.