Viral video: మహిళలు, బాలికలను ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. బెదిరిస్తూ.. కాల్పులు.. తాలిబన్ల తీరుపై ఈయూ ఆందోళన

మహిళలు, బాలికలను బెదిరిస్తూ తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటే అఫ్గానిస్థాన్ లో మహిళలు, బాలికలు నిరసన తెలిపిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై యురోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ కాబూల్ కు వెళ్తుండగా వారిని తాలిబన్లు అడ్డగించారు. గాల్లోకి కాల్పులు జరిపి బెదిరించారు. దీంతో, నిరసన తెలుపుతోన్న మహిళలు పరుగులు తీశారు.

Viral video: మహిళలు, బాలికలను ఇష్టం వచ్చినట్లు కొడుతూ.. బెదిరిస్తూ.. కాల్పులు.. తాలిబన్ల తీరుపై ఈయూ ఆందోళన

Viral video

Updated On : August 14, 2022 / 4:25 PM IST

Viral video: మహిళలు, బాలికలను బెదిరిస్తూ తాలిబన్లు కాల్పులు జరిపారు. ఆహారం, పని, స్వేచ్ఛ కావాలంటే అఫ్గానిస్థాన్ లో మహిళలు, బాలికలు నిరసన తెలిపిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై యురోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేసింది. మహిళలు నిరసన ర్యాలీ నిర్వహిస్తూ కాబూల్ కు వెళ్తుండగా వారిని తాలిబన్లు అడ్డగించారు. గాల్లోకి కాల్పులు జరిపి బెదిరించారు. దీంతో, నిరసన తెలుపుతోన్న మహిళలు పరుగులు తీశారు.

కొందరు మహిళలను పట్టుకున్న తాలిబన్లు వారిని ఇష్టం వచ్చినట్లు కొట్టారు. కొందరు మహిళల వెంటపడి మరీ తాలిబన్లు హింసించారు. అఫ్గానిస్థాన్ లో తాలిబన్ల పాలన వచ్చినప్పటి నుంచి మహిళలపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అనేక ఆంక్షల నడుమ మహిళలు, బాలికలు బిక్కుబిక్కుమంటూ బతకాల్సి వస్తోంది. బాలికలు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలు ర్యాలీ తీయగా వారిపై కూడా తాలిబన్లు దారుణంగా వ్యవహరించారు. దీనిపై యురోపియన్ యూనియన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన చేసింది.

మహిళలు, బాలికలకు స్వేచ్ఛను ఇవ్వకుండా వ్యవహరిస్తోన్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. మహిళలు, బాలికలకు విద్య, ప్రాథమిక అవసరాలు సరిగ్గా అందడం లేదు అని ఈయూ పేర్కొంది. అంతర్జాతీయ ఒప్పందాలకు అఫ్గాన్ కట్టుబడి ఉండాలని, దేశ పాలనలో అఫ్గాన్లు అందరినీ భాగస్వాములు చేయాలని చెప్పింది. అలాగే, అఫ్గాన్ ఏ ఇతర దేశానికీ భద్రతా పరంగా ముప్పు తెచ్చేలా వ్యవహరించవద్దని పేర్కొంది.