మద్యం మత్తులో మాజీ ఎమ్మెల్యే కొడుకు వీరంగం : బిగ్ బాస్ ఫేమ్ తో దురుసు ప్రవర్తన
పఠాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ వివాదంలో చిక్కకున్నాడు. మద్యం మత్తులో ఆశిష్ గౌడ్ వీరంగం చేశాడు. అమ్మాయిలతో అసభ్యకరంగా

పఠాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ వివాదంలో చిక్కకున్నాడు. మద్యం మత్తులో ఆశిష్ గౌడ్ వీరంగం చేశాడు. అమ్మాయిలతో అసభ్యకరంగా
పఠాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్ వివాదంలో చిక్కకున్నాడు. మద్యం మత్తులో ఆశిష్ గౌడ్ వీరంగం చేశాడు. అమ్మాయిలతో అసభ్యకరంగా వ్యవహరించాడని, వారిపై దాడి కూడా చేశాడని ఆరోపణలు వచ్చాయి. ఇక బిగ్ బాస్-2 ఫేమ్ సంజనతో దురుసుగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. పబ్ లో తప్పతాగి తమపై దాడి చేశాడని.. చేయి పట్టి లాగడమే కాకుండా బూతులు తిట్టాడని కొందరు అమ్మాయిలు ఆశిష్ గౌడ్ పై మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మాదాపూర్ లోని ఓ పబ్ లో శనివారం(నవంబర్ 30,2019) అర్థరాత్రి ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన తర్వాత ఆశిష్ గౌడ్ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పబ్ లో అసలేం జరిగింది అనేది తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.
ఆశిష్ తనపై మద్యం బాటిళ్లతో దాడికి దిగాడని, బిల్డింగ్‌పై నుంచి తోసి వేయడానికి ప్రయత్నించాడని సంజన ఆరోపించింది. హైటెక్స్ సమీపంలోని నోవాటెల్ హోటల్ లో శనివారం అర్థరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సంజన తెలిపింది. రాత్రి 2 గంటల సమయంలో తన స్నేహితురాలితో కలిసి నిలబడి ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఆశిష్ వేధింపులతో భయభ్రాంతులకు గురయ్యానని వాపోయింది. ఎలాగో అలా అతడి బారి నుంచి తప్పించుకుని బయటపడ్డానని చెప్పింది. పబ్ లో సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయంది.
ఆశిష్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటే.. చుట్టూ పలువురు చూస్తున్నా అతన్ని ఎవరూ అడ్డుకోలేదని సంజన ఆవేదన వ్యక్తం చేసింది. బౌన్సర్ల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని, వారు కూడా ఆశిష్ ను పట్టించుకోలేదని పోలీసులతో చెప్పింది. చివరికి హోటల్ యాజమాన్యం కూడా ఆశిష్ ను అడ్డుకునే ప్రయత్నం చేయలేదంది.