హైదరాబాద్ లో భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం

  • Published By: chvmurthy ,Published On : August 28, 2019 / 03:38 PM IST
హైదరాబాద్ లో  భారీగా పేలుడు పదార్ధాలు స్వాధీనం

Updated On : August 28, 2019 / 3:38 PM IST

హైదరాబాద్ లో కలకలం చెలరేగింది. భారీగా పేలుడు పదార్ధాలు పట్టుబడ్డాయి. బుధవారం(ఆగస్టు 28,2019) రాత్రి డీసీఎం వ్యాన్ లో పేలుడు పదార్ధాలు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ ఫై ఓవర్ పై దగ్గర డీసీఎం వ్యాన్ ని పట్టుకున్నారు. పేలుడు పదార్ధాలను శంషాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్నపోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.

వీటిని ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయమై విచారణ చేస్తున్నారు. ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్దాలు పట్టుబడటం సంచలనంగా మారింది. పోలీసులు అలర్ట్ అయ్యారు. డీసీఎం వ్యాన్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.