Extra Marital Affair : భార్య వివాహేతర సంబంధం..విషయం తెలిసిన భర్త…

భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసిన భర్త ఆమెకు నచ్చచెప్పాడు. అలాంటి పనులు మానుకోమని... బుద్ధిగా కాపురం చేసుకుందామని బతిమాలాడు. అది ఆమెకు నచ్చలేదు. భర్త మాటలు పెడచెవిన పెట్టిన భార్య తన ప్రవర్తన మార్చుకోలేదు. సహనం నశించిన భర్త, భార్యను అంతమొందించి నేరుగా పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

Extra Marital Affair : భార్య వివాహేతర సంబంధం..విషయం తెలిసిన భర్త…

Extra Marital Affair

Updated On : May 1, 2021 / 1:31 PM IST

Extra Marital Affair : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిసిన భర్త ఆమెకు నచ్చచెప్పాడు. అలాంటి పనులు మానుకోమని… బుద్ధిగా కాపురం చేసుకుందామని బతిమాలాడు. అది ఆమెకు నచ్చలేదు. భర్త మాటలు పెడచెవిన పెట్టిన భార్య తన ప్రవర్తన మార్చుకోలేదు. సహనం నశించిన భర్త, భార్యను అంతమొందించి నేరుగా పోలీసుస్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు.

కర్ణాటక లోని హోసూరు తాలూకాలో చెన్నబసప్ప(44) భార్య గౌరమ్మ(40)తో కలిసి జీవిస్తున్నాడు. గౌరమ్మ పక్కింటి వ్యక్తితో వివాహేతర సంబధం పెట్టకుంది. ఈ విషయం తెలిసిన బసప్ప ఆమెకు హితబోధ చేశాడు. అయినా ఆమె లెక్కచేయక వివాహేతర సంబంధం కొనసాగించసాగింది.

గురువారం, ఏప్రిల్ 29 రాత్రి గౌరమ్మ పక్కింటి వ్యక్తితో సన్నిహితంగా ఉండటం చెన్నబసప్ప చూశాడు. కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా భార్యను తుదముట్టించాలనుకున్నాడు. ఏమి తెలియనట్టు ఊరుకున్నాడు. భార్యను అర్ధరాత్రి నిద్రలేపి వేపనపల్లి సమీపంలోని కేఎస్ పోడూరు బసవేశ్వర స్వామి ఆలయం వద్దకు తీసుకువెళ్లాడు.

అక్కడ ఆమె తలపై బండరాయితో కొట్టి చంపాడు. శుక్రవారం ఉదయం హోసూరు పట్టణ పోలీసు స్టేషన్ కు వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గౌరమ్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.