Extra Marital Affair : వివాహేతర బంధం… అతనికి 20, ఆమెకు 25, నెలలోపే ఇద్దరూ….!

వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది.  వీరిలో  ప్రియురాలు 20 రోజుల క్రితమే మరణిం, ప్రియుడు మరోసారి ఆత్మహత్య చేసుకుని ఆదివారం మరణించాడు.

Extra Marital Affair : వివాహేతర బంధం… అతనికి 20, ఆమెకు 25, నెలలోపే ఇద్దరూ….!

Extra Marital Affair

Updated On : November 9, 2021 / 5:02 PM IST

Extra Marital Affair : వివాహేతర సంబంధం రెండు నిండు ప్రాణాలను బలిగొంది.  వీరిలో  ప్రియురాలు 15 రోజుల క్రితమే మరణించగా, ప్రియుడు మరోసారి ఆత్మహత్య చేసుకుని ఆదివారం మరణించాడు.

మహబూబ్ నగర్ జిల్లా గోపన్ పల్లికి చెందిన ఆంజనేయులుకి, మరికల్ మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి చెందిన ఓ మహిళతో వివాహం అయ్యింది. వారికి సంతానం కలగకపోవటంతో ఆంజనేయులు తన భార్య చెల్లెలు అక్షిత(25)ను నాలుగేళ్ల క్రితం రెండో వివాహం చేసుకున్నాడు. వారికి మూడేళ్ల బాబు ఉన్నాడు, ప్రస్తుతం అక్షిత ఏడు నెలల గర్భిణీ. ఇద్దరు భార్యలతో ఆంజనేయులు జీవనం సాగిస్తున్నాడు.

అక్షిత అదే గ్రామానికి చెందిన మధు(20) అనే యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఏమైందో ఏమో తెలియదు కానీ ఇద్దరూ కలిసి అక్టోబర్ 25న అక్షిత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు.

Also Read : Minister KTR Fires On Opposition : సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కార్యకర్తలు విజృంభించాలి-కేటీఆర్

ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఇద్దరినీ స్ధానికుల సహాయంతో మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అక్షిత కన్నుమూసింది. మెరుగైన చికిత్స నిమిత్తం మధును ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించగా కోలుకున్నాడు.

కాగా… మధు మూడు రోజుల క్రితం అడ్డాకుల మండలం గుడిబండలోని పెద్దమ్మ జయమ్మ ఇంటికి వచ్చాడు. ప్రియురాలు మరణించిందనే మనస్తాపంతో ఉన్న మధు ఆదివారం రాత్రి పెద్దమ్మ ఇంటిముందున్న చెట్టుకు ఉరివేసుకుని మరణించాడు. సోమవారం ఉదయం బంధువులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్టిం నిర్వహించి బంధువులకు మృతదేహాన్ని అప్పగించారు.