మహిళా ఎస్సై బలవన్మరణం

మహిళా ఎస్సై బలవన్మరణం

Updated On : January 2, 2021 / 4:29 PM IST

Female Sub-Inspector dies by suicide in UP’s Bulandshahr district : ఉత్తర ప్రదేశ్ లోని బులంద్ షహార్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని అనూప్ షహర్ పోలీసు స్టేషన్ లో విధులు నిర్వరిస్తున్న మహిళా ఎస్సై బలవన్మరణానికి పాల్పడింది. ఆర్జూ పవార్(30) అనే మహిళా ఎస్సై, తాను అద్దెకు ఉంటున్న ఇంటిలో శుక్రవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

ఆర్జూ అద్దెకు ఉంటున్న ఇంట్లో నుంచి చాలా సేపటి వరకు అలికిడి లేకపోవటంతో….ఇంటి యజమానురాలికి అనుమానం వచ్చి తలుపులు తెరిచి చూడగా ఆమె ఫ్యాన్ కు ఉరివేసుకుని కనిపించింది. వెంటనే యజమానురాలు పోలీసులకు సమాచారం ఇచ్చారు.

ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా ఘటనా స్ధలంలో సూసైడ్ నోట్ లో తన చావుకు తానే కారణం అని ఆర్జూ పేర్కోన్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని మృతురాలి కుటుంబ సభ్యులతో పాటు ఆమె స్నేహితులను కూడా విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.