అమీషా పటేల్ డబ్బులు ఎగ్గొట్టింది…కోర్టుకెళ్లిన ప్రొడ్యూసర్

  • Published By: venkaiahnaidu ,Published On : March 29, 2019 / 03:59 PM IST
అమీషా పటేల్ డబ్బులు ఎగ్గొట్టింది…కోర్టుకెళ్లిన ప్రొడ్యూసర్

Updated On : March 29, 2019 / 3:59 PM IST

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ అమీషా పటేల్ ఇబ్బందుల్లో చిక్కుకుంది.మోసం,చెక్ బౌన్స్ ఆరోపణలతో ఆమెపై ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ రాంచీ కోర్టులో కంప్లెయింట్ ఫైల్ చేశారు. 

దేశి మ్యాజిక్ అనే సినిమా పూర్తి చెయ్యాలన్న కారణంతో  గత ఏడాది మార్చిలో రాంచీలో ఓ ఈవెంట్ కి హాజరైన అమీషా పటేల్,ఆమె బిజినెస్ పార్టనర్ కున్నాల్ గ్రూమర్ తన దగ్గర 2.5కోట్లు అప్పుగా తీసుకుందని నిర్మాత అజయ్ కుమార్ తెలిపారు. రెండు,మూడు నెలల్లో వడ్డీతో కలిపి చెల్లిస్తామని చెప్పారని,కొన్ని రోజుల తర్వాత 3కోట్ల రూపాయల చెల్లని చెక్ ఇచ్చారని,దీనిపై వాళ్లని సంప్రదించగా..తాము డబ్బులు చెల్లించమని చెప్పారని ప్రొడ్యూసర్ అజయ్ కుమార్ ఆరోపించారు.అంతేకాకుండా కొందరు పెద్ద వ్యక్తులతో అమీషా పటేల్ దిగిన ఫొటోలు చూపించి తమకు పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలున్నాయని,చంపేస్తామని బెదిరించారని అజయ్ ఆరోపించాడు