Bellamkonda Suresh : బెల్లంకొండపై పీడీయాక్ట్ నమోదు చేయాలి-ఫైనాన్షియర్ శరణ్

సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ చాలామందిని  చీట్ చేశాడు,  నన్ను అలాగే చీట్ చేశాడని అతనికి డబ్బులు   ఇచ్చిన ఫైనాన్షియర్  శరణ్ అన్నాడు.

Bellamkonda Suresh : బెల్లంకొండపై పీడీయాక్ట్ నమోదు చేయాలి-ఫైనాన్షియర్ శరణ్

Bellamkonda Suresh

Updated On : March 12, 2022 / 3:09 PM IST

Bellamkonda Suresh : సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ చాలామందిని  చీట్ చేశాడు,  నన్ను అలాగే చీట్ చేశాడని అతనికి డబ్బులు   ఇచ్చిన ఫైనాన్షియర్  శరణ్ అన్నాడు.  10 టీవీప్రతినిధితో  మాట్లాడుతూ  శరణ్…రెండు సంవత్సరాలుగా బెల్లంకొండ సురేష్ ను  డబ్బులు అడుగుతుంటే కాలయాపన చేశాడు… పైగా నన్ను చంపుతా అని బెదిరిస్తున్నాడు అని చెప్పారు.

నావద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి, సురేష్ సొంత బ్యానర్ లక్ష్మీ నరసింహ అనే బ్యానర్ కు నేను రూ. 85 లక్షల  రూపాయలు ఇచ్చాను అని ఆయన చెప్పుకొచ్చాడు. సురేష్ ఆరోపించినట్లు నా వెనుక ఎవరూ రాజకీయ నాయకులు లేరు..దీని వెనుక ఎలాంటి రాజకీయ కుట్ర లేదు..మా ఫ్యామిలీ బిజినెస్ నేపధ్యం ఉన్న కుటుంబం అని శరణ్ తెలిపాడు.
Also Read : Akhanda: అఖండ దండయాత్ర.. ఈరోజుల్లో కూడా వందరోజుల రేర్ ఫీట్
సురేష్ ది మాది ఒకటే ఊరు అని… సోమవారం నేను హైదరాబాద్ పోలీసు కమీషనర్ సీవీ ఆనంద్ ను కలుస్తానని… అతనిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరాడు. నేను ఇచ్చిన డబ్బులు రూ. 85 లక్షలు తిరిగి ఇచ్చేంతవరకు సురేష్ ఎంత దూరం వెళితే నేను అంత దూరం వెళతాను అని శరణ్ అన్నాడు.