Fire Accident In US : అమెరికాలో అగ్నిప్రమాదం.. ఆరుగురు చిన్నారులు సహా 8 మంది మృతి

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఓక్లహోమాలోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. బ్రోకెన్ యారో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4 గంటల సమయంలో మంటలు చెలరేగాయి.

Fire Accident In US : అమెరికాలో అగ్నిప్రమాదం.. ఆరుగురు చిన్నారులు సహా 8 మంది మృతి

fire accident in us

Updated On : October 29, 2022 / 5:45 PM IST

Fire Accident In US : అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో 8 మంది మృతి చెందారు. ఓక్లహోమాలోని ఓ ఇంట్లో చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో ఆరుగురు చిన్నారులు సహా ఎనిమిది మంది మృతి చెందారు. బ్రోకెన్ యారో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం 4 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేసినా.. ఇంట్లోని వారి ప్రాణాలను కాపాడలేకపోయారు.

అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.  హత్య లేదా ఆత్మహత్య చేసుకునే ఆవకాశాలను కూడా కొట్టిపారేయలేమని బ్రోకెన్‌ యారో ఫైర్‌ చీఫ్‌ జెరేమీ మూర్‌ పేర్కొన్నారు. ఇంటి వెనుక భాగంలో ఉన్న గదిలో మంటలు చెలరేగి ఇంటికి వ్యాపించినట్లుగా భావిస్తున్నారు.

US Crime : అమెరికాలో ఘోర సంఘటన .. ఓ ఇంట్లో ఆరుగురు చిన్నారులతో సహా ఎనిమిది మృతదేహాలు .. హత్యలా? ఆత్మహత్యలా?!

మెడికల్ రిపోర్టు వచ్చిన తర్వాతే ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని స్థానిక పోలీసులు అంటున్నారు. కాగా, ఇదే ఇంటి నుంచి తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.