Mumbai: 15 అంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

మంటలను ఆర్పేందుకు రెండు ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్, ఇతర అగ్నిమాపక సామగ్రిని తెప్పించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

Mumbai: 15 అంతస్తుల భవనంలో ఘోర అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

Updated On : September 23, 2023 / 3:16 PM IST

Mumbai News: ముంబైలోని దాదర్ ప్రాంతంలో ఉన్న 15 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగడంతో 60 ఏళ్ల వృద్ధుడు ఊపిరాడక మృతి చెందాడు. హిందూ కాలనీలోని రెయిన్‌ట్రీ భవనంలోని ఫ్లాట్ నంబర్ 1302లో శనివారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదం జరిగిన అరగంటకే మంటలు అదుపులోకి వచ్చాయి.

ఇక, మృతుడివిషయానికి వస్తే.. పొగ కారణంగా సచిన్ పాట్కర్ అనే వ్యక్తి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతడిని సివిల్‌ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మంటలను ఆర్పేందుకు రెండు ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్, ఇతర అగ్నిమాపక సామగ్రిని తెప్పించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.

ఇవి కూడా చదవండి..

Purandeswari : ప్రజావేదిక కూల్చటం, అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపించటమే వైసీపీ ప్రభుత్వం చేసే పని

Iran Hijab Bill : ఇరాన్‌లో హిజాబ్ తప్పనిసరి .. ఉల్లంఘిస్తే 10 ఏళ్లు జైలు శిక్ష,భారీ జరిమానా