Fire Breaks Out : ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం, నలుగురి మృతి

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. యూపీలో ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలో రాజుకున్న మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు.....

Fire Breaks Out : ఉత్తరప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం, నలుగురి మృతి

Fire Breaks Out In Uttar Pradesh

Updated On : July 4, 2023 / 7:36 AM IST

Fire Breaks Out In Uttar Pradesh : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. యూపీలో ఝాన్సీ జిల్లాలో మూడు అంతస్తుల భవనంలో రాజుకున్న మంటల్లో నలుగురు సజీవ దహనమయ్యారు. ఎలక్ట్రానిక్, స్పోర్ట్సు స్టోరులో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మరణించడం అందరినీ కలిచివేసింది. షోరూంలో రాజుకున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక వాహనాలు వచ్చాయి. ఈ అగ్నిప్రమాదానికి కారణాలు తెలియలేదు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం తరలించామని ఝాన్సీ ఎస్పీ రాజేష్ చెప్పారు. అగ్నిప్రమాదానికి కారణాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు.