Malakpet Metro Station : హైదరాబాద్ మలక్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బైకులు

ఈ క్రమంలోనే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Malakpet Metro Station : హైదరాబాద్ మలక్‌పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బైకులు

Updated On : December 6, 2024 / 7:19 PM IST

Malakpet Metro Station : హైదరాబాద్ మలక్ పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 బైకులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసింది. దట్టంగా పొగ అలుముకోవడంతో మలక్ పేట్-దిల్ సుఖ్ నగర్ మధ్య ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.

మెట్రో పార్కింగ్ లో పార్క్ చేసిన వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. 5 నుంచి 6 బైకులు కాలి బూడదయ్యాయి. అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసింది. గడిచిన కొన్ని రోజులుగా మెట్రో పార్కింగ్ ఏరియాలో పార్క్ చేస్తున్న వాహనాల నుంచి పెట్రోల్ దొంగతనం చేస్తున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు, వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. అగ్నిప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు.

మలక్ పేట్ మెట్రో స్టేషన్ పార్కింగ్ ఏరియాలో ఉంచుతున్న వాహనాల నుంచి స్థానికంగా ఉండే కొందరు వ్యక్తులు పెట్రోల్ చోరీ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు కూడా పెట్రోల్ తీస్తుండగా ఈ అగ్ని ప్రమాదం జరిగి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి మంటలను అదుపు చేయడంతో ప్రమాద తీవ్రతను తగ్గించినట్లైందని స్థానికులు చెబుతున్నారు. కాగా, మెట్రో స్టేషన్ ప్కారింగ్ ఏరియాల్లో పార్క్ చేస్తున్న వాహనాల నుంచి పెట్రోల్ చోరీలకు పాల్పడుతుండటం వాహనదారులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ చోరీలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు అధికారులు, పోలీసులు తీసుకోవాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

 

Also Read : తెలంగాణ తల్లి కొత్త విగ్రహం ఇదే..! కొత్త విగ్రహంలో ఏమేం మార్పులు చేశారంటే..