Tunisian coast boats capsized:ట్యూనీషియా తీరంలో 3 పడవలు బోల్తా..ఐదుగురి మృతి, పలువురి గల్లంతు

ట్యూనీషియా సముద్ర తీరంలో వలసదారులతో వెళుతున్న మూడు పడవలు బోల్తా పడ్డాయి. మధ్యధరా సముద్రంలో మూడు వలస పడవలు బోల్తా పడిన తర్వాత ఐదుగురు ఆఫ్రికన్లు చనిపోయారని, మరికొంతమంది గల్లంతు అయ్యారని ట్యునీషియా కోస్ట్ గార్డ్ చెప్పారు....

Tunisian coast boats capsized:ట్యూనీషియా తీరంలో 3 పడవలు బోల్తా..ఐదుగురి మృతి, పలువురి గల్లంతు

Tunisian coast boats capsized

Updated On : June 9, 2023 / 8:07 AM IST

Tunisian coast boats capsized: ట్యూనీషియా సముద్ర తీరంలో వలసదారులతో వెళుతున్న మూడు పడవలు బోల్తా పడ్డాయి. మధ్యధరా సముద్రంలో మూడు వలస పడవలు బోల్తా పడిన తర్వాత ఐదుగురు ఆఫ్రికన్లు చనిపోయారని, మరికొంతమంది గల్లంతు అయ్యారని ట్యునీషియా కోస్ట్ గార్డ్ చెప్పారు.ఈ ప్రాంతంలో ఒక చిన్నారితో సహా ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు స్ఫాక్స్ ప్రాసిక్యూటర్ ఫౌజీ మస్మౌడీ తెలిపారు.

Newlywed couple reunites: ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో కలిసిన నవ దంపతులు

మూడు పడవలు సముద్రంలో మునిగిపోవడంతో 73 మంది వలసదారులను రక్షించామని, 47 మంది గల్లంతు అయ్యారని ఫౌజీ మస్మౌడీ చెప్పారు.ఇనుప పడవలు కావడంతో , అవి సముద్రపు నీటిలో మునిగాయని మస్మౌదీ చెప్పారు.ట్యునీషియా నుంచి పడవలో ఇటలీకి వలస వెళ్లడానికి పెరుగుతున్న ప్రయత్నాలలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ ఏడాది ఇలా పడవ ప్రమాదాల్లో 500మంది మరణించారు.