Girls Trafficking : బాలికల అక్రమ రవాణా గుట్టు రట్టు…… ఐదుగురు బాలికలను కాపాడిన డీసీడబ్ల్యూ
బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను ఢిల్లీ మహిళా కమీషన్ భగ్నం చేసింది. ఈముఠా చెర నుంచి ఐదుగురు బాలికలను రక్షించారు.

Girls Trafficking
Girls Trafficking : బాలికలను అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాను ఢిల్లీ మహిళా కమీషన్ భగ్నం చేసింది. ఈముఠా చెర నుంచి ఐదుగురు బాలికలను రక్షించారు. అక్టోబర్ 19న దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీ నుంచి ఐదుగురు బాలికలను పశ్చిమ బెంగాల్ కు తరలిస్తున్నారని శక్తివాహిని అనే ఎన్జీవో, డీసీడబ్ల్యూకు సమాచారం అందింది. చైల్డ్‌లైన్ పోలీసు అధికారులతో న్యూఢిల్లీ రైల్వేస్టేషన్‌కు చేరుకున్న డీసీడబ్ల్యూ సభ్యుల బృందం ఐదుగురు బాలికలను ముఠా బారినుంచి విముక్తి కల్పించింది.
తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి జైనా అనే మహిళ, లాడెన్ అనే వ్యక్తి ఢిల్లీకి తీసుకు వచ్చారని బాధిత బాలికలు వెల్లడించారు. మదన్‌పూర్ ఖదర్ గ్రామంలోని ఒక గదిలో తమను నిర్బంధించారని చెప్పారు. నిందితులు తమను ఢిల్లీలో కొందరికి విక్రయించాలని ప్రయత్నించారని కూడా వారు పేర్కొన్నారు. గత కొంతకాలంగా నిందితులకు తెలిసిన వారు తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాలికలు తెలిపారు.
Also Read : Liger: ఎన్సీబీ కంట్రోల్‌లో అనన్య.. లైగర్‌కు సెగ తప్పదా?