Tihar Jail : తీహార్ జైల్లో మరణమృదంగం..ఎలా చనిపోతున్నారు ?
నివారం కూడా తీహార్ జైలు నంబర్ 3లో ఓ ఖైదీ మృతి చెందాడు. ఖైదీ తన సెల్‌లో అపస్మారక స్థితిలో ఉండడంతో గుర్తించిన జైలు అధికారులు...

Tihar
Five Inmates Die In 8 Days : తీహార్ జైల్లో మరణమృదంగం మోగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత భద్రతతో కూడిన తీహార్ జైలులో గత ఎనిమిది రోజుల్లో ఐదుగురు ఖైదీలు మరణించటం సంచలనంగా మారింది. కరడుగట్టిన నేరగాళ్లకు కేంద్రంగా ఉన్న తీహార్ జైల్లో చోటు చేసుకుంటున్న మరణాలు ఢిల్లీ ప్రభుత్వాన్ని షాక్ కు గురి చేస్తున్నాయి. తాజాగా మరణాలకు సంబంధించిన విషయాన్ని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.
Read More : Five States Election : మళ్ళీ ఆంక్షల వలయం..ఎన్నికలు నిర్వహించాలా ? వద్దా ?
దీంతో తీహార్ జైల్ లో వరుసగా చోటుచేసుకుంటున్న మరణాలపై మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. తీహార్ జైల్లో ఖైదీలవి సహజ మరణాలే అంటున్నారు అధికారులు. ఇందులో ఎలాంటి సందేహాలకు తావు లేదని అంటున్నారు. అయినప్పటికీ వరుసగా జైల్లో చోటు చేసుకున్న మరణాలపై సిఆర్ పి సి యొక్క సెక్షన్ 176 ప్రకారం మెజిస్టీరియల్ విచారణ జరుపుతున్నామన్నారు.
Read More : Omicron : ఒమిక్రాన్‌పై బిగ్ రిలీఫ్.. 90శాతం మందిలో లక్షణాలే లేవు, చికిత్స కూడా అవసరం లేదు
2021, డిసెంబర్ 25వ తేదీ శనివారం కూడా తీహార్ జైలు నంబర్ 3లో ఓ ఖైదీ మృతి చెందాడు. ఖైదీ తన సెల్‌లో అపస్మారక స్థితిలో ఉండడంతో గుర్తించిన జైలు అధికారులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఖైదీని పరీక్షించిన వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లు ప్రకటించారు. ఇతను చైన్ స్నాచింగ్ చేసి జైలుకు వచ్చినట్టు చెప్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగానే అతడు కూడా మరణించాడని జైలు అధికారులు చెబుతున్నారు. మృతి చెందిన ఖైదీని విక్రమ్ అలియాస్ విక్కీగా గుర్తించారు. మరి విచారణలో ఎలాంటి విషయాలు బయటపడుతాయో చూడాలి.