Stock Exchange Fraud Case : స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో నగరవాసులకు గాలం.. రూ. 20 కోట్లు కాజేసిన సైబర్ నేరగాళ్లు అరెస్ట్
Stock Market Fraud Case : స్టాక్ ఎక్స్చేంజిలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఇప్పిస్తామని నగరవాసులకు గాలం వేశారు. అమాయకులను మోసగించి వారి నుంచి కోట్లు కొల్లగొట్టారు.

Four Arrested for defrauding People of Rs.20 Crore in Stock Market Fraud
Stock Market Fraud Case : స్టాక్ ఎక్స్చేంజ్ పేరుతో భారీ మోసాలకు పాల్పడ్డారు సైబర్ నేరగాళ్లు. ఒకటి కాదు.. రెండు కాదు.. దేశవ్యాప్తంగా 128 కేసులల్లో రూ. 20 కోట్లు రూ. 20 కోట్లు కాజేశారు. స్టాక్ ఎక్స్చేంజిలో తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టి అధిక లాభాలు ఇప్పిస్తామని నగరవాసులకు గాలం వేశారు. అమాయకులను మోసగించి వారి నుంచి కోట్లు కొల్లగొట్టారు.
Read Also : నా మొబైల్ ఫోన్‌ను బలవంతంగా సీజ్ చేశారు: బీఆర్ఎస్ నేత క్రిశాంక్
ఈ చీటింగ్ కేసులో నలుగురిపై పలు సైబర్ క్రైమ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. ఆన్‌లైన్ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వారికి వివిధ బ్యాంక్ అకౌంట్స్ అందిస్తున్న సురేంద్ర, నరేష్ బాబును కూడా అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్ నిందితులకు 8 అకౌంట్లను కమిషన్ తీసుకొని అందించినట్టు నిందితులు పోలీసుల విచారణలో బయటపెట్టారు. దేశవ్యాప్తంగా 83 కేసుల్లో రూ. 5 కోట్లను ఈ అకౌంట్స్ ద్వారా ట్రాన్సాక్షన్ జరిగినట్లు సైబర్ క్రైమ్ గుర్తించింది.
తెలంగాణ నుంచి 3 కేసులు :
మరో కేసులో క్రిప్టో ఎక్స్చేంజ్ ట్రేడింగ్ బిజినెస్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయంటూ నిందితులు ప్రచారం చేశారు. సైబర్ క్రైమ్ నిందితులకు సహకరించిన సాయి గౌడ్, సాయికుమార్, ఇద్దరినీ సైబర్ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా 45 కేసుల్లో 20కోట్లను కొట్టేయగా.. అందులో 3 కేసులు తెలంగాణకు చెందినవే ఉన్నాయి. ఇందులో నలుగురు నిందితులు సైబర్ క్రైమ్ నేరస్తులకు సహకరించినట్టుగా పోలీసులు గుర్తించారు.
Read Also : Hyderabad Student : అమెరికాలో హైదరాబాద్ వాసి కిడ్నాప్ కేసులో ట్విస్ట్..!