Crime News : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో దారుణం చోటు చేసుకుంది. అవమాన భారంతో ఒక కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు.

Crime News : ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య

Crime News

Updated On : June 4, 2021 / 5:56 PM IST

Crime News : మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కీసరలో దారుణం చోటు చేసుకుంది. అవమాన భారంతో ఒక కుటుంబంలోని నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం రేణిగుంటకు చెందిన భిక్షపతి, ఉష దంపతులు బతుకు తెరువు కోసం హైదరాబాద్ వచ్చారు. నాగారం-వెస్ట్ గాంధీనగరంలో ఇల్లు అద్దెకు తీసుకుని నివసిస్తున్నారు. భిక్షపతి ఆటో నడుపుకుంటూ ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో భిక్షపతి తన పక్క ఇంట్లో ఉన్న బాలిక పట్ల అసభ్యకరంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ  విషయమై స్ధానికులు గురువారం రాత్రి అతడిపై దాడి చేశారు. అనంతరం శుక్రవారం ఉదయం పెద్దల సమక్షంలో మాట్లాడదామని  చెప్పి వెళ్లిపోయారు. తనకు జరిగిన అవమానానికి తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి… మొదట భార్యా పిల్లలకు ఉరివేసి అనంతరం తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉదయం వీరిని గమనించిన స్ధానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్ధలానికి వచ్చిన పోలీసులు మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనా స్ధలం వద్దనుంచి సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.