విలాసాలకు మరిగి ముఠా దోపిడీలు

  • Published By: veegamteam ,Published On : February 4, 2019 / 09:39 AM IST
విలాసాలకు మరిగి ముఠా దోపిడీలు

Updated On : February 4, 2019 / 9:39 AM IST

బెంగళూరు లో నలుగురు యువకులు విలాసవంతమైన జీవనానికి అలవాటు పడి చోరీలు, దోపిడీల బాట పట్టి కటకటాల పాలయ్యారు. దేవనహళ్లికి చెందిన సలీం, గోవిందపుర వాసి మహ్మద్‌షఫీ, నెలమంగళ నివాసి ఇమ్రాన్‌పాష, హాసన్‌ జిల్లాకు చెందిన లోకేశ్‌లను పీణ్య పోలీసులు ఆదివారం అరెస్ట్‌ చేశారు. నిందితులనుంచి రూ.7లక్షల విలువైన  229 గ్రాముల బంగారం, ఒక బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. 

ఈ నలుగురు తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దోపిడీకి పాల్పడతారు. ఒకరు తలుపులు తొలగిస్తుండగా మరొకరు బయట కాపలా ఉంటారు. మిగతా ఇద్దరు లోపలకు చొరబడి చోరీలకు పాల్పడేవారని విచారణలో పోలీసులు తెలిపారు. 

అదేవిధంగా ఒంటరిగా వెళ్లేవారిని అడ్డగించి దోపిడీలకు పాల్పడేవారని తెలిపారు. జనవరి 18న పీణ్య పోలీస్ స్టేషన్‌ పరిధిలోని HMT పార్క్‌ వద్ద నాగేశ్‌ అనే వ్యక్తికి చెందిన బైక్‌ను నిందితులు చోరీ చేశారన్నారు.  నిందితుడు లోకేశ్‌ హత్య కేసులో జైలుకెళ్లి జామీన్‌పై విడుదలై వచ్చి చోరీలబాట పట్టాడని పోలీసులు తెలిపారు.