మగాళ్లు చేయలేని పని : నరరూప రాక్షసుడిని పట్టుకున్న మహిళా ATS టీం
అతడో కరడుగట్టిన నేరస్థుడు.. నరరూప రాక్షకుడు. ఎందరో అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాడు. రాష్ట్రాన్ని వణికించాడు. పోలీసులకు దొరక్కుండా ఏడాదిగా తప్పించుకుని తిరుగుతున్నాడు.

అతడో కరడుగట్టిన నేరస్థుడు.. నరరూప రాక్షకుడు. ఎందరో అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాడు. రాష్ట్రాన్ని వణికించాడు. పోలీసులకు దొరక్కుండా ఏడాదిగా తప్పించుకుని తిరుగుతున్నాడు.
అతడో కరడుగట్టిన నేరస్థుడు.. నరరూప రాక్షకుడు. ఎందరో అమాయకుల ప్రాణాలను బలితీసుకున్నాడు. రాష్ట్రాన్ని వణికించాడు. పోలీసులకు దొరక్కుండా ఏడాదిగా తప్పించుకుని తిరుగుతున్నాడు. చిక్కడు దొరకడు అన్నట్టుగా పట్టుకునేందుకు వెళ్లిన పోలీసుల కళ్లుగప్పి అడవిలోకి వెళ్లి దాక్కున్నాడు. ఇతడిపై హత్య, దోపిడీ, బలవంతపు వసూళ్లు, కిడ్నాప్ వంటి ఎన్నో క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న ఈ గ్యాంగ్ స్టర్ కోసం పోలీసులు బృందాలుగా ఏర్పడి అడవి అంతా గాలించిన ఫలితం లేకుండా పోయింది. గతంలో అడవిలోకి వెళ్లిన పోలీసులపై కాల్పులు జరిపాడు.
2018 ఏడాదిలో జూన్ నెలలో హత్యకేసులో పెరోల్ కింద బయటకు వచ్చిన గ్యాంగ్ స్టర్ జూసబ్ అల్లర్ఖా తప్పించుకుని అడవిలో పారిపోయాడు. ఈ క్రమంలో గుజరాత్ లోని బొట్వాడ్ జిల్లా అటవీ ప్రాంతంలో యాంటి టెర్రరిజం స్క్వాడ్ (ATS)బృందం రంగంలోకి దిగింది. ఈ బృందంలో అంతా మహిళలే.. అయినప్పటికీ ఎవరికి సాధ్యంకాని రీతిలో నేరస్థుడి ఆట కట్టించారు. AK47 గన్స్ చేతబట్టి ధైర్యంగా అడవిలోకి దూసుకెళ్లారు. భయంకరమైన అడవిలో దాక్కున్న జూసబ్ నేరస్థుడిని గాలించి ఆదివారం అతన్ని పట్టేసుకున్నారు.
విశ్వసనీయ సమాచారం మేరకు ఏటీఎస్ ఐదుగురితో కూడిన మహిళల బృందం దట్టమైన అడవిలోకి వెళ్లి జల్లెడ పట్టింది. ఐదుగురిలో సబ్ ఇన్స్ పెక్టర్లు శాంటోక్బెన్ ఒడెదర, అరుణాబెన్ గమేథి, నితమిక గోహెల్, శకుంతల మాల్, జిగ్నేష్ అగర్వాత్.. గ్యాంగ్ స్టర్ జూసబ్ కోసం కొండలు, గుట్టల్లో తీవ్రంగా గాలించారు. రాత్రి నుంచి తెల్లవారుజామున 4:30 గంటల వరకు గాలించారు.
అదే సమయంలో అప్రమత్తమైన జూసన్.. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. అతన్ని పట్టుకున్నట్టు ఏటీఎస్ బృందంలో ఒకరు వెల్లడించారు. వాంటెండ్ అల్లర్ఖాపై జునాగాడ్, రాజ్ కోట్, అహ్మదాబాద్ సహా పలు జిల్లాల్లో 23 కేసులు ఉన్నట్టు అధికారి ఒకరు తెలిపారు. జూలైలో ఓ వ్యక్తిని హత్యచేసిన కేసులో పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని పోలీసులపై కాల్పులు జరిపి అడవిలోకి పారిపోయాడు. అప్పటి నుంచి జూలబ్ ను పట్టుకునేందుకు స్థానిక పోలీసులకు సాధ్యం కాలేదు. దీంతో ఏటీఎస్ బృందాన్ని రంగంలోకి దింపడంతో నేరస్థుడు జూలబ్ ను అడవిలో రాత్రంతా గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. అనంతరం అతడ్ని సీఐడీ క్రైం బ్రాంచ్ కు అప్పగించారు.