Rajastan: గ్యాంగ్‌స్టర్ రాజు థెట్ దారుణ హత్య.. తామే చేశామని ఒప్పుకున్న లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్
ఈ ఘటన జరిగిన కాసేపటికే రోహిత్ గొదార అనే వ్యక్తి కాల్పులకు బాధ్యుడిని తానేనని, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినంటూ ఫేస్బుక్ ద్వరా ప్రకటించాడు. ఆనంద్ పాల్ గ్యాంగ్‌కు చెందిన బల్బీర్ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు రోహిత్ ప్రకటించాడు. జూలై 2014లో బికనీర్ జైలులో జరిగిన గొడవల్లో ఓ గ్యాంగ్ చేతిలో బనుదాను హత్య చేశారు.

Gangster Raju Theth shot in Rajasthan’s Sikar, Lawrence Bishnoi group claims responsibility
Rajastan: పశ్చిమ ఆసియా దేశాల్లో జరిగే పేలుళ్లు, హత్యలపై అక్కడి ఉగ్రవాద సంస్థలు బాధ్యత వహిస్తుంటాయి. అదేదో సమాజ సేవ చేసినట్లు ‘ఆ హత్యలు చేసింది మేమే చేశాం’ అని ఒప్పుకుంటాయి. ఇండియాలో పరిస్థితి అలాగే కనిపిస్తోంది. తాజాగా ఓ రౌడీ షీటర్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతి కిరాతకంగా పట్టపగలే నడిరోడ్డుపై కాల్చి చంపారు. ఇది జరిగిన కాసేపటికే లారెన్స్ బిష్ణోయి గ్రూప్ స్పందిస్తూ, ఇది తాము చేసిన పనే అంటూ సమర్ధించుకోవడం గమనార్హం. దేశంలో ఇలాంటివి ఈ మధ్య కాలంలో అయితే లేవు. హత్యలు, నేరాలు జరుగుతున్నప్పటికీ తామే చేశామంటూ గర్వంగా చెప్పుకునే పరిస్థితి అయితే కనిపించదు. అయితే కొంత కాలంగా ఇలాంటి ప్రకటనలు వస్తుండడం ప్రజల్ని ఉలిక్కిపాటుకు గురి చేస్తోంది.
OYO Layoff Employees: ఒయోలో భారీ మార్పులకు శ్రీకారం.. ఇంటిబాట పట్టనున్న 10శాతం మంది ఉద్యోగులు
ఇక విషయంలోకి వస్తే.. రాజస్తాన్‌లో హై ప్రొఫైల్ గ్యాంగ్‌స్టర్‌గా పేరు గాంచిన రాజు థెట్ అనే వ్యక్తి శనివారం దారుణ హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలోని సికార్ నగరం పిప్రాలి రోడ్డులో ఉదయం 9:30 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు కురిపించిన బుల్లెట్ల వర్షానికి రాజు అక్కడికక్కడే కూలబడిపోయాడు. రాజుతో పాటు మరో వ్యక్తి సైతం ఈ కాల్పుల్లో మరణించాడు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ఘటన జరిగిన కాసేపటికే రోహిత్ గొదార అనే వ్యక్తి కాల్పులకు బాధ్యుడిని తానేనని, తాను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడినంటూ ఫేస్బుక్ ద్వరా ప్రకటించాడు. ఆనంద్ పాల్ గ్యాంగ్‌కు చెందిన బల్బీర్ బనుదా హత్యలకు ప్రతీకారంగానే రాజును హతమార్చినట్లు రోహిత్ ప్రకటించాడు. జూలై 2014లో బికనీర్ జైలులో జరిగిన గొడవల్లో ఓ గ్యాంగ్ చేతిలో బనుదాను హత్య చేశారు.
Reservations: 76 శాతానికి రిజర్వేషన్లను పెంచిన ఛత్తీస్‌గఢ్.. ఏయే వర్గానికి ఎంత కేటాయింపంటే?