లిఫ్టులో ఇరుక్కుని బాలిక మృతి

హైదరాబాద్ ఎల్బీనగర్ లో విషాదం చోటు చేసుకుంది. పిండి పుల్లారెడ్డి కాలనీలోని ఓ అపార్ట్ మెంట్ లిఫ్టులో ఇరుక్కుని 8 ఏళ్ల బాలిక మృతి చెందింది. లాస్య అనే బాలిక ఆడుకుంటూ లిఫ్టు లో ఇరుక్కుపోయింది. ఇది గమనించిన అపార్ట్ మెంట్ వాసులు వెంటనే బాలికను బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలోనే బాలిక మరణించింది.
దీంతో ఆ కుటుంబంలోవిషాదఛాయలు అలుముకున్నాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.