Goa Attack: గోవాలో టూరిస్టులపై కత్తులు, తల్వార్లతో గూండాల దాడి.. స్పందించిన సీఎం

గోవా సందర్శనకు వచ్చిన పర్యాటకులపై స్థానిక గూండాలు కత్తులు, తల్వార్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Goa Attack: గోవాలో టూరిస్టులపై కత్తులు, తల్వార్లతో గూండాల దాడి.. స్పందించిన సీఎం

Goa Attack: పర్యాటక కేంద్రమైన గోవాలో దారుణం జరిగింది. గోవా సందర్శనకు వచ్చిన పర్యాటకులపై స్థానిక గూండాలు కత్తులు, తల్వార్లతో దాడి చేశారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై బాధితులు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు.

RRR ‘Naatu Naatu Oscars95’ : RRR టీమ్‌ను ఘనంగా సత్కరిస్తాం : మంత్రి తలసాని

బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జతిన్ శర్మ, అతడి కుటుంబం గోవా సందర్శనకు వెళ్లింది. అక్కడి ఒక రిసార్ట్ హోటల్‌లో స్థానిక సిబ్బందితో చిన్న వాగ్వాదం జరిగింది. ఈ విషయంపై జతిన్ కుటుంబం సిబ్బందిపై మేనేజర్‌కు ఫిర్యాదు చేసింది. దీంతో సిబ్బందికి కోపం వచ్చింది. వాళ్లు తమకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేశారు. దీంతో కొంతమంది గూండాలు కత్తులు, తల్వార్లు పట్టుకుని వచ్చారు. జతిన్ కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో జతిన్ కుటుంబ సభ్యులకు తీవ్ర గాయలయ్యాయి. రక్తపు మడుగులో పడిపోయరు. వెంటనే స్థానికుల సహకారంతో వారిని ఆస్పత్రికి చేర్చి చికిత్స అందించారు.

Naatu Naatu : నాటు నాటు ఆస్కార్ గెలుపుపై రాజకీయ ప్రముఖుల కామెంట్స్.. మోదీ, జగన్, చంద్రబాబు, కేసీఆర్.. అభినందనలు..

ఈ ఘటనపై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు 324 సెక్షన్ కిందే కేసు నమోదు చేశారు. దీంతో నిందితులు త్వరగా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పోలీసుల తీరుపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తిరిగి నిందితులపై 307 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అంటే హత్యాయత్నం కింద కేసు నమోదైంది. ఈ ఘటనలో ఇప్పటివరకు పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. మరోవైపు ఈ ఘటనపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.