ఖైదీలకు తీపి కబురు : ఎన్నిసార్లయినా ములాఖత్‌

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జైళ్లశాఖ డీజీ వీకేసింగ్‌ ఖైదీలకు వరాలు ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : January 27, 2019 / 02:53 AM IST
ఖైదీలకు తీపి కబురు : ఎన్నిసార్లయినా ములాఖత్‌

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జైళ్లశాఖ డీజీ వీకేసింగ్‌ ఖైదీలకు వరాలు ఇచ్చారు.

హైదరాబాద్ : తెలంగాణ జైళ్లశాఖ ఖైదీలకు తీపి కబురు అందించింది. ఖైదీలు ఎన్నిసార్లయినా కుటుంబ సభ్యులను ములాఖత్‌లలో కలుసుకోవచ్చని వెల్లడించింది. 70వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జైళ్లశాఖ డీజీ వీకేసింగ్‌ ఖైదీలకు వరాలు ఇచ్చారు. ములాఖత్‌లపై ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు ప్రకటించారు. తెలంగాణ జైళ్లలోని ఖైదీలు, ఎన్నిసార్లయినా కుటుంబ సభ్యులను ములాఖత్‌లలో కలుసుకోవచ్చని వెల్లడించారు. ఖైదీలు మానసికంగా ఇబ్బందులకు గురికాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. గతంలో వారానికి రెండు సార్లే కలుసుకునే అవకాశం ఉండేది. జనవరి 26 శనివారం ఆయన చంచల్‌గూడ జైళ్లశాఖ పరేడ్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. 

జైళ్ల నుంచి కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడే సౌకర్యాల్లోనూ ఇకపై ఆంక్షలు ఉండవని చెప్పారు. విచారణ ఖైదీల క్యాంటీన్‌ ఖర్చుల పరిమితిని రూ.2,500 నుంచి రూ.10 వేల వరకు పెంచాలనే ప్రతిపాదన ఉందని తెలిపారు.