Sangareddy : ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కక్కర్ వాడలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది.

Sangareddy : ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఆత్మహత్య

Government Teacher Suicide

Updated On : January 4, 2022 / 5:22 PM IST

Sangareddy :  సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం కక్కర్ వాడలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. సోమవారం పాఠశాలకు వెళ్లిన సిర్గాపూర్ మండలం కడపల్ గ్రామానికి చెందిన ఉపాధ్యాయురాలు అనిత(28) మధ్యాహ్నం తర్వాత కనిపించకపోవడంతో తోటి ఉపాధ్యాయులు వెతికారు.

పాఠశాల పరిసరాల్లోని బావిలో ఉపాధ్యాయురాలు చెప్పులు కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించారు. బావిలో నీటిని తోడేసిన పోలీసులు ఉపాధ్యాయురాలు మృతదేహాన్ని వెలికితీశారు.
Also Read : US Covid Cases : అమెరికాలో కోవిడ్ సునామీ..ఒక్కరోజే 10లక్షలకు పైగా కేసులు
అనారోగ్య సమస్యలు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో గత కొంత కాలంగా ఉపాధ్యాయురాలు ఆందోళన చెందుతున్నట్లు కుటుంబీకులు తెలిపినట్లు పోలీసులు వెల్లడించారు. శవ పరీక్షల నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.