Sonu and Premchand: భర్తను ఏడుసార్లు జైలుకు పంపింది. మళ్లీ ప్రతీసారి ఆమెనే బెయిల్ ఇచ్చింది.. ఇలా ఎందుకు చేసిందంటే?

సోనూ ఫిర్యాదులపై ప్రేమ్‌చంద్ 2016 నుంచి 2018 వరకు ప్రతి ఏడాది అరెస్ట్ అవుతూనే ఉన్నాడు. గృహహింస ఆరోపణలతో అరెస్ట్ అవుతున్న అతడికి ప్రతిసారీ అతని భార్యనే బెయిల్ ఇప్పించి విడిపిస్తోంది. 2019, 2020లో కూడా ప్రేమ్‌చంద్ జైలుకు వెళ్లవలసి వచ్చింది

Sonu and Premchand: భర్తను ఏడుసార్లు జైలుకు పంపింది. మళ్లీ ప్రతీసారి ఆమెనే బెయిల్ ఇచ్చింది.. ఇలా ఎందుకు చేసిందంటే?

Gujarat: గుజరాత్‌లోని మెహసానాలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడి ఓ మహిళ తన భర్తను పదేళ్లలోపు 7 సార్లు జైలుకు పంపింది. ఇందులో విచిత్రం ఏంటంటే.. జైలుకు వెళ్లిన భర్తకు వచ్చిన ప్రతిసారీ ఆ మహిళే బెయిల్ ఇప్పించింది. ఈ విషయం గృహ హింసకు సంబంధించినదిగా చెబుతున్నారు.

Pune : ఈ ఆర్టిస్ట్ టాలెంట్ చూడండి.. పూలు అమ్ముతున్న పెద్దావిడ చిత్రాన్ని ఎంత బాగా గీసాడో..

అసలు విషయం తెలియాలంటే.. 2014 సంవత్సరానికి వెళ్లాలి. మెహసానాలోని కడిలో నివసించే ప్రేమ్‌చంద్ మాలి, సోనూ 2001లో వివాహం చేసుకున్నారు. పెళ్లయిన 13 ఏళ్ల తర్వాత అంటే 2014లో వీరి బంధం చెడిపోవడం మొదలైంది. సోనూ 2015లో తన భర్తపై మొదటిసారి కేసు పెట్టింది. తన భర్త తనను కొట్టాడని, శారీరకంగా దాడి చేశాడని ఆరోపించింది. ఈ వ్యవహారం కోర్టుకు వెళ్లగా.. సోనూకు ప్రతినెలా 2000 రూపాయల భరణం చెల్లించాలని కోర్టు ఆదేశించింది.

Shah Rukh Khan : న‌య‌న‌తార భ‌ర్త‌కు షారుఖ్ ఖాన్‌ వార్నింగ్.. ఆమెతో జాగ్ర‌త్త..
రోజువారీ వేతన జీవి ప్రేమ్‌చంద్‌కు భరణం చెల్లించలేకపోయాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. సోనూ దాదాపు ఐదు నెలల పాటు జైలులో ఉన్న తర్వాత, అతని భార్య సోను అతనికి బెయిల్ ఇప్పించింది. బెయిల్ తర్వాత సోనూ, ప్రేమ్‌చంద్ విడివిడిగా జీవించడం మొదలుపెట్టారు. అయితే కొంతకాలం తర్వాత ఇద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు.

Khiladi Lady Rasheeda : అటువంటి మగవాళ్లే టార్గెట్, నాలుగు రాష్ట్రాల్లో 8 పెళ్లిళ్లు చేసుకున్నయువతి..

సోనూ ఫిర్యాదులపై ప్రేమ్‌చంద్ 2016 నుంచి 2018 వరకు ప్రతి ఏడాది అరెస్ట్ అవుతూనే ఉన్నాడు. గృహహింస ఆరోపణలతో అరెస్ట్ అవుతున్న అతడికి ప్రతిసారీ అతని భార్యనే బెయిల్ ఇప్పించి విడిపిస్తోంది. 2019, 2020లో కూడా ప్రేమ్‌చంద్ జైలుకు వెళ్లవలసి వచ్చింది. కారణం అతను భరణం చెల్లించలేకపోవడం. కానీ సోను మళ్లీ అతనికి బెయిల్ ఇచ్చింది.

AP Cabinet Decisions : నిరుపేదలకు భూములు, ఇళ్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు

తాజాగా, ఈ ఏడాది ప్రారంభంలో కూడా ప్రేమ్ చంద్ అరెస్టు అయ్యాడు. దాదాపు ఆరు నెలల తర్వాత మరోసారి సోనూ తన భర్తకు జూలై 4న బెయిల్ ఇచ్చింది. జులై 5న, బెయిల్ తర్వాత ఒక రోజు తన వాలెట్, సెల్‌ఫోన్ మాయమైనట్లు ప్రేమ్‌చంద్ చెప్పాడు. ఈ విషయంపై భార్యను ప్రశ్నించగా.. తనకు తెలియదని నిరాకరించింది. కొంత సేపటికి ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి అది కాస్తా ఘర్షణగా మారింది.

PAN Aadhaar DeLink : మీ పాన్-ఆధార్ తప్పుగా లింక్ అయిందా? ఎలా డీలింక్ చేయాలో తెలుసా? ఏ డాక్యుమెంట్లు కావాలి? ఫీజు ఎంతంటే?

చివరకు ప్రేమ్‌చంద్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ప్రేమ్‌చంద్ ప్రస్తుతం తన తల్లితో కలిసి పటాన్‌లో నివసిస్తున్నాడు. ఈసారి కేసు కాస్త తిరగబడింది. తన భార్య, కొడుకు తనకు హాని చేశారని ఆరోపిస్తూ ప్రేమ్‌చంద్ కేసు పెట్టాడు. జూలై 7న ప్రేమ్‌చంద్ కేసు నమోదు చేశారు.