నాకేమీ తెలియదు, రేప్ చెయ్యలేదు : జడ్జి ప్రశ్నలకు దిమ్మతిరిగే జవాబులిచ్చిన హాజీపూర్ సీరియల్ కిల్లర్

హాజీపూర్‌ మైనర్ బాలికల అత్యాచారం, హత్య కేసు విచారణను న్యాయస్థానం జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు

  • Published By: veegamteam ,Published On : December 27, 2019 / 02:11 AM IST
నాకేమీ తెలియదు, రేప్ చెయ్యలేదు : జడ్జి ప్రశ్నలకు దిమ్మతిరిగే జవాబులిచ్చిన హాజీపూర్ సీరియల్ కిల్లర్

Updated On : December 27, 2019 / 2:11 AM IST

హాజీపూర్‌ మైనర్ బాలికల అత్యాచారం, హత్య కేసు విచారణను న్యాయస్థానం జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు

హాజీపూర్‌ మైనర్ బాలికల అత్యాచారం, హత్య కేసు విచారణను న్యాయస్థానం జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని ఫాస్ట్ ట్రాక్ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. నిందితుడు ఇచ్చిన వాంగ్మూలాన్ని న్యాయస్థానం రికార్డు చేసింది. అలాగే మరో ఇద్దరు మైనర్ బాలికల కేసులను కూడా కోర్టు విచారించనుంది.
 
మైనర్ బాలిక కేసులో తనపై సాక్ష్యులు చెప్పినవన్నీ అబద్ధాలేనని నిందితుడు శ్రీనివాసరెడ్డి ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు తెలిపాడు. బాలిక కేసుతో తనకేమీ సంబంధం లేదన్నాడు. అసలు ఆమె ఎవరో తనకు తెలియదని చెప్పాడు. ఐతే.. 29 మంది సాక్షులు ఇచ్చిన వాంగ్మూలాన్ని నిందితుడు శ్రీనివాసరెడ్డికి న్యాయమూర్తి వినిపించారు. శ్రీనివాసరెడ్డిని జడ్జి పలు ప్రశ్నలు అడిగారు. జడ్జి అడిగిన ప్రశ్నలన్నింటికి.. లేదు, కాదు, తెలియదంటూ శ్రీనివాసరెడ్డి సమాధానమిచ్చాడు. దీంతో విచారణను కోర్టు జనవరి 3కు వాయిదా వేసింది.

ఇక కోర్టులో విచారణ సందర్భంగా మీరు పోర్న్ చూస్తారా అని శ్రీనివాసరెడ్డిని జడ్జి అడిగారు. దాని సమాధానంగా తన దగ్గర ఆండ్రాయిడ్‌ ఫోన్‌ లేదంటూ నిందితుడు సమాధానమిచ్చాడు. కర్నూలు సువర్ణ హత్యపై అడిగిన ప్రశ్నకు… అసలు తనకు సువర్ణ అంటే ఎవరో తెలియదన్నాడు శ్రీనివాసరెడ్డి. తాను లిఫ్ట్ మెకానిక్‌గానే ఎన్నడూ పని చేయలేదని జవాబిచ్చాడు. అలాగే ఫోరెన్సిక్ రిపోర్టులో బాలికల దుస్తులపై స్పెర్మ్, రక్తపు మరకలు నీవే అని తేలిందని న్యాయమూర్తి అనగా… పోలీసులు సిరంజీలతో చల్లారని నిందితుడు సమాధానమిచ్చాడు. అనంతరం సాక్షులుగా అమ్మ, నాన్న, అన్నలను తీసుకురావాలని కోర్టును కోరాడు శ్రీనివాసరెడ్డి. 

యాదాద్రి భువనగిరి జిల్లా హాజీపూర్‌లో ముగ్గురు బాలికలు శ్రావణి, మనీషా, కల్పన అత్యాచారం, హత్యకు గురయ్యారు. ఓ పాడుబడ్డ బావిలో వీరి మృతదేహాలు బయటపడ్డాయి. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ వరుస హత్యలు… సంచలనం సృష్టించాయి. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడిగా శ్రీనివాసరెడ్డిని అరెస్ట్‌ చేశారు పోలీసులు. నల్లగొండ ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్ట్‌లో అక్టోబర్‌ నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. భారీ పోలీస్‌ బందోబస్త్ మధ్య శ్రీనివాస్‌రెడ్డిని జిల్లా జైలు నుంచి కోర్టుకు తరలించారు. పోలీసులు, బాధితులతోపాటు నిందితుడు శ్రీనివాస్‌రెడ్డి తరపు వాదనలను కూడా న్యాయస్థానం విన్నది. పలు ప్రశ్నలకు శ్రీనివాసరెడ్డి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో విచారణను జనవరి 3కు వాయిదా వేసింది కోర్టు.