Haryana Youtuber Arrest: దేశద్రోహులు..! భారత్‌లో ఉంటూ పాకిస్తాన్‌కు గూఢచర్యం.. లేడీ యూట్యూబర్ సహా ఆరుగురు అరెస్ట్..
డబ్బు ఆశ చూపించి, నకిలీ వివాహ వాగ్దానాల ద్వారా మోసగించారని అధికారులు తెలిపారు.

Haryana Youtuber Arrest: ఉండేది భారత్ లో. పని చేసేది మాత్రం శత్రు దేశం పాకిస్తాన్ కు. ఎప్పటికప్పుడు భారత్ కు చెందిన కీలకమైన, సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ కు చేరవేయడమే వారి పని. మన దేశంలో ఉంటూ, ఇక్కడి గాలి పీలుస్తూ, ఇక్కడి తిండి తింటూ… మాతృభూమికే వెన్నుపోటు పొడుస్తున్నారు కొందరు దేశద్రోహులు. తాజాగా ఇలాంటి కొందరు దేశ ద్రోహులను పోలీసులు అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ ఏజెన్సీలకు భారత్ కు చెందిన కీలక, సున్నితమైన సమాచారం చేరవేస్తున్నారన్న ఆరోపణలతో పోలీసులు ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారిలో ఒక అమ్మాయి కూడా ఉంది. ఆమె ఒక యూట్యూబర్.
పాకిస్తాన్ సంస్థలకు సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలతో హర్యానాకు చెందిన ట్రావెల్ బ్లాగర్‌తో సహా ఆరుగురు భారతీయులను అరెస్ట్ చేశారు. ఈ నెట్‌వర్క్ హర్యానా పంజాబ్ అంతటా విస్తరించి ఉంది. ఏజెంట్లుగా, ఇన్ఫార్మర్లుగా వారు వ్యవహరిస్తున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న తరుణంలో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. భారత్ లో ఉంటూ పాకిస్తాన్ కోసం పని చేస్తున్న దేశద్రోహులను గుర్తించే పనిలో పడ్డాయి.
నిందితుల్లో హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఉంది. ఆమె పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ గా పని చేసిందని, భారత సైనిక సమచారాన్ని పాక్ కు చేరవేసిందని పోలీసులు గుర్తించారు. “ట్రావెల్ విత్ జో” అనే యూట్యూబ్ ఛానల్ నడిపిన జ్యోతి మల్హోత్రా.. ట్రావెల్ వీసా మీద 2023లో పాకిస్తాన్ లో పర్యటించినట్లు అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బంది ఎహ్సాన్-ఉర్-రహీం అలియాస్ డానిష్‌తో సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకుంది.
మే 13న డానిష్ ను భారత్ దేశం నుంచి బహిష్కరించింది. జ్యోతిని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ కి పరిచయం చేశాడని డానిష్ పై ఆరోపణలు ఉన్నాయి. వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్‌చాట్ వంటి ఎన్‌క్రిప్టెడ్ ప్లాట్‌ఫామ్‌లలో, జ్యోతి షకీర్ అలియాస్ రాణా షాబాజ్‌తో సహా కార్యకర్తలతో టచ్‌లో ఉంది. ఆమె అతని నెంబర్‌ను “జాట్ రంధావా” అని సేవ్ చేసింది.
Also Read: సాయం చేసిన భారత్‌ను కాదని.. పాకిస్తాన్‌పై తుర్కియేకు అంత ప్రేమ ఎందుకు? బలమైన కారణాలేంటి..
ఆమె భారత దేశంలోని ప్రదేశాలకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్ తో పంచుకుంది. అంతేకాదు సోషల్ మీడియాలో పాకిస్తాన్ గురించి సానుకూలతను ప్రదర్శించడానికి ఉపయోగించుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఆమె ఒక PIOతో సన్నిహిత సంబంధాన్ని ఏర్పరచుకుందని, అతనితో ఇండోనేషియాలోని బాలికి కూడా ప్రయాణించిందని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.
జ్యోతిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 152, అధికారిక రహస్యాల చట్టం, 1923లోని సెక్షన్ 3, 4, 5 కింద అభియోగాలు మోపబడ్డాయి. కేసును హిసార్‌లోని ఆర్థిక నేరాల విభాగానికి అప్పగించారు. జ్యోతితో పాటు, మరో కీలక నిందితుడు పంజాబ్‌లోని మలేర్‌కోట్లాకు చెందిన 32 ఏళ్ల వితంతువు గుజాలా. ఫిబ్రవరి 27, 2025న గుజాలా వీసా కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్‌ను సందర్శించింది.
అక్కడ, ఆమె డానిష్‌ను కలిసింది. అతనితో క్రమం తప్పకుండా మాట్లాడటం ప్రారంభించింది. త్వరలోనే డానిష్ ఆమెను వాట్సాప్ నుండి టెలిగ్రామ్‌కు మారమని ఒప్పించాడు. అది సురక్షితమైనదని పేర్కొన్నాడు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చాడు. చాట్, వీడియో కాల్‌ల ద్వారా ఆమె రిలేషన్ షిప్ మెయింటేన్ చేశాడు. ఆమె నమ్మకాన్ని సంపాదించాడు.
కొన్ని రోజులకు గుజాలాకు డబ్బు పంపడం ప్రారంభించాడు డానిష్. మార్చి 7న ఫోన్‌పే ద్వారా రూ. 10వేలు, మార్చి 23న గూగుల్ పే ద్వారా రూ. 20వేలు పంపాడు. ఏప్రిల్ 23న, గుజాలా తన స్నేహితురాలు, మలేర్‌కోట్లాకు చెందిన మరో వితంతువు బాను నస్రీనాతో కలిసి పాకిస్తాన్ హైకమిషన్‌కు తిరిగి వచ్చింది. డానిష్ వారి వీసాను సులభతరం చేశాడు. మరుసటి రోజే జారీ చేయబడింది.
ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతరులలో మలేర్‌కోట్లాకు చెందిన యమీన్ మొహమ్మద్ ఉన్నాడు. ఇతడు డానిష్ తో ఆర్థిక లావాదేవీలు, వీసా సంబంధ కార్యకలాపాలు నడిపాడు. మరొకరు దేవిందర్ సింగ్ థిల్లాన్. ఇతడు హర్యానా కైతాల్ వాసి. సిక్కు విద్యార్థి. పాకిస్తాన్ కు తీర్థయాత్రకు వెళ్లిన సమయంలో పాక్ ఏజెన్సీ అధికారులను పరిచయం చేసుకున్నాడు. పాటియాలా కంటోన్మెంట్ వీడియోలను పాక్ కు పంపించాడు. మరొకడు అర్మాన్. హర్యానా నుహ్ కు చెందిన అర్మాన్.. భారత్ కు చెందిన సిమ్ కార్డులు సప్లయ్ చేశాడు. నిధులు ట్రాన్స్ ఫర్ చేశాడు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ సూచనల మేరకు ఢిపెన్స్ ఎక్స్ పో 2025ని విజిట్ చేశాడు.
ఈ కేసు ఒక పెద్ద గూఢచర్య ఆపరేషన్‌లో భాగమని అధికారులు తెలిపారు. డబ్బు ఆశ చూపించడంతో పాటు పెళ్లి చేసుకుంటానే నకిలీ హామీలతో వారిని ట్రాప్ చేశారని వివరించారు. విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని సమాచారం.
పాకిస్తాన్‌కు తీర్థయాత్ర చేస్తున్నప్పుడు నియమించబడి పాటియాలా కంటోన్మెంట్ వీడియోలను పంపిన సిక్కు విద్యార్థి హర్యానాలోని కైతాల్‌కు చెందిన దేవిందర్ సింగ్ ధిల్లాన్; పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ సూచనల మేరకు భారతీయ సిమ్ కార్డులను సరఫరా చేసి, నిధులను బదిలీ చేసి, డిఫెన్స్ ఎక్స్‌పో 2025ని సందర్శించిన హర్యానాలోని నుహ్‌కు చెందిన అర్మాన్ ఉన్నారు.