Haveri Incident: తిక్క కుదిరింది.. మళ్లీ జైలుకి లైంగిక దాడి నిందితులు.. బెయిల్‌పై వచ్చి వీధుల్లో రోడ్ షోలు, వేడుకలు..

దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు సీరియస్ అయ్యారు.

Haveri Incident: తిక్క కుదిరింది.. మళ్లీ జైలుకి లైంగిక దాడి నిందితులు.. బెయిల్‌పై వచ్చి వీధుల్లో రోడ్ షోలు, వేడుకలు..

Updated On : May 26, 2025 / 8:27 PM IST

Haveri Incident: ఏదో ఘనకార్యం సాధించినట్లు బిల్డప్ ఇచ్చారు. రోడ్లపైకి వచ్చి వేడుకలు జరుపుకున్నారు. కార్లతో రోడ్ షో చేశారు. వీధుల్లోకి వచ్చి ఊరేగారు. కట్ చేస్తే.. వారి తిక్క కుదిరింది. బెయిల్ పై వచ్చి వీధుల్లో వేడుకలు జరుపుకున్న లైంగిక దాడి కేసులో నిందితులు మళ్లీ అరెస్ట్ అయ్యారు. పోలీసులు వారిని కటకటాల్లోకి నెట్టారు.

బెయిల్‌పై విడుదలైన లైంగిక దాడి కేసు నిందితులు రోడ్‌ షో నిర్వహించడం కర్ణాటకలోని హవేరిలో సంచలనం రేపింది. వీరి తీరుతో అంతా విస్తుపోయారు. తప్పు చేసి.. ఏదో ఘనకార్యం చేసినట్లు ఏంటీ దిక్కుమాలిన పనులు అంటూ అంతా మండిపడ్డారు. వారి బరి తెగింపుపై ఫైర్ అయ్యారు. 2024 జనవరిలో హంగల్ లో జరిగిన ఓ లైంగిక దాడి కేసులో నిందితులైన ఏడుగురికి బెయిల్‌ లభించింది. ఈ నెల 20న వారికి హవేరి సబ్‌ జైల్ వద్ద స్వాగతం లభించడం, వారు రోడ్‌ షో చేయడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది.

బెయిల్ పై రిలీజ్ కావడంతో నిందితులు దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. 5 వాహనాల్లో రోడ్‌ షో నిర్వహించారు. అక్కి అలూర్‌ ప్రధాన వీధుల్లో ఊరేగారు. పెద్ద పెద్దగా అరుస్తూ రోడ్లపై పరేడ్ చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు సీరియస్ అయ్యారు. వెంటనే యాక్షన్ తీసుకున్నారు.

Also Read: అయ్యో పాపం..! భార్య చేతిలో తన్నులు తిన్న దేశాధ్యక్షుడు..? వీడియో వైరల్..

ఏడుగురు నిందితుల్లో నలుగురిని అరెస్ట్‌ చేశారు. మళ్లీ కటకటాల్లోకి నెట్టారు. మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నారు పోలీసులు. రోడ్‌షో నిర్వహించడం ద్వారా వారు బెయిల్ షరతులను ఉల్లంఘించారని పోలీసులు తెలిపారు. షరతులను ఉల్లంఘించినందుకు వారి బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసే పనిలో పోలీసులు ఉన్నారట.

లైంగిక దాడి కేసులో బాధితురాలు కోర్టులో వీరిని సరిగా గుర్తించలేకపోవడంతో వారికి బెయిల్‌ మంజూరైంది. బాధితురాలు తన భాగస్వామితో ఒక హోటల్‌లో ఉన్నప్పుడు నిందితులు వారిద్దరిపై దాడి చేశారు. ఆమెను లాక్కెళ్లారు. కాసేపటి తర్వాత లాడ్జి దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. లాడ్జి సిబ్బంది ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.