French President Macron: అయ్యో పాపం..! భార్య చేతిలో తన్నులు తిన్న దేశాధ్యక్షుడు..? వీడియో వైరల్..
ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ..

French President Macron : ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్‌కు చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు కొంత విస్మయానికి గురవుతున్నారు. మాక్రాన్ తన భార్య చేతిలో తన్నులు తిన్నారనే చర్చ జరుగుతోంది.
ఆగ్నేయ ఆసియా పర్యటనలో భాగంగా ఆదివారం సాయంత్రం వియత్నాం రాజధాని హనోయ్‌కు మాక్రాన్ దంపతులు చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో సిబ్బంది విమానం తలుపు తెరిచారు. ఆ వెంటనే ఒక షాకింగ్ దృశ్యం కనిపించింది. మాక్రాన్ భార్య ఆయన ముఖంపై దాడి చేసింది. చేత్తో అతడిని బలంగా తోసి వేసినట్లు అందులో కనిపించింది. దీంతో మాక్రాన్ షాక్ కి గురయ్యారు. ఇదంతా వీడియోలో రికార్డ్ అయ్యింది. ఆ వెంటనే మాక్రాన్ తేరుకుని హాయ్ చెప్పడం వీడియోలో కనిపించింది.
హనోయ్ ఎయిర్ పోర్టులో విమానం తలుపు తెరుచుకుంటుండగా, బ్రిగిట్టే మాక్రాన్ తన భర్త, అధ్యక్షుడు మాక్రాన్ వైపు చేయి చాపి, ఆయన ముఖంపై తన చేతులను ఉంచి, పక్కకు నెట్టినట్లు వీడియోలో గమనించవచ్చు. భార్య చర్యతో ఫ్రెంచ్ అధ్యక్షుడు కాసేపు ఆశ్చర్యపోయినట్లు కనిపించాడు. ఆ వెంటనే తేరుకుని తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన ప్రతినిధి బృందానికి ఆయన చేయి ఊపారు.
Also Read: పార్లమెంట్‌లో షాకింగ్ ఘటన.. షూలో బీర్ వేసుకుని తాగిన ఎంపీ.. వీడియో వైరల్.
ఇక విమానం నుంచి కిందకు దిగే సమయంలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కిందకు దిగబోతున్న భార్యకు తన చేతిని అందించే ప్రయత్నం చేశారు మాక్రాన్. అయితే ఆమె అదేమీ పట్టించుకోలేదు. తనంతట తానుగా విమానం దిగేసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. దంపతుల మధ్య గొడవలు ఉన్నాయనే టాక్ ఊపందుకుంది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోపై మాక్రాన్ కార్యాలయం స్పందించింది. తొలుత ఆ చిత్రాలను అసత్యమైనవిగా తోసిపుచ్చింది. ఆ తర్వాత అవి నిజమైనవని నిర్ధారించింది.
మాక్రాన్ తన వారం రోజుల ఆగ్నేయాసియా పర్యటనను ప్రారంభించడానికి హనోయ్‌కు చేరుకున్నారు. ఇండోనేషియా, సింగపూర్ లో ఆయన పర్యటించాల్సి ఉంది.
View this post on Instagram