సహజీవనం చేస్తున్న గర్ల్‌ఫ్రెండ్‌ని రేప్ చేశాడన్న కేసులో ప్రియుడికి హైకోర్టు బెయిల్.. ఇక్కడే ఓ ట్విస్ట్….

అత్యాచారం కేసులో అరెస్టు అయిన నిందితుడికి హైకోర్టు బెయిల్ ఇచ్చింది.. తనపై అత్యాచారం చేశాడంటూ బాధితురాలు ఫిర్యాదు చేసినా కోర్టు నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది.. ఎందుకంటే.. ఇందులోనే ఓ ట్విస్ట్ ఉంది..
మొదట్లో ఇష్టం లేకన్నా ఆమెను లోబర్చుకున్నాడు.. అయినా అప్పట్లో అతడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయలేదు.. ఆ రోజు నుంచి ఇద్దరు కలిసిపోయారు.. కొంతకాలం పాటు కలిసి సహజీవనం సాగించారు.. కొన్ని నెలలు బాగానే వీరి మధ్య సంబంధం సాగింది. ఈ మధ్యనే ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.. రిలేషన్ బ్రేకప్ అయి ఇద్దరూ విడిపోయారు..
అంతే.. తనపై అత్యాచారం చేశాడంటూ ఇప్పుడు ప్రియుడిపై ఫోక్సో చట్టం కింద ఫిర్యాదు చేసింది ప్రియురాలు.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాంబే హైకోర్టులో హాజరుపరిచారు. ఈ కేసుపై విచారించిన కోర్టు నిందితుడికి వెంటనే బెయిల్ మంజూరు చేసింది.
కలిసి ఉన్నంత కాలం బాగానే ఉండి.. ఇప్పుడు గొడవలు అయ్యే సరికి అత్యాచారం అంటూ ఫిర్యాదు చేయడాన్ని కోర్టు తప్పుబట్టింది.. మొదట్లోనే ఎందుకు ఫిర్యాదు చేయలేదని కోర్టు బాధితురాలిని ప్రశ్నించింది. ప్రాథమిక విచారణలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ పరిశీలించిన జస్టిస్ భారతి డాంగ్రే 18 ఏళ్ల నిందితుడికి బెయిల్ మంజూరు చేశారు. తన ప్రియుడితో సంబంధం కొనసాగించినప్పటి నుంచి విడిపోయే వరకు శారీరక సాన్నిహిత్యం గురించి ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని కోర్టు పేర్కొంది.
నివేదిక ప్రకారం.. జూలై 7న యువకుడిని ముంబై పోలీసుల సైబర్ సెల్ అరెస్ట్ చేసింది. జూనియర్ కాలేజీలో చదివే సమయంలో నిందితుడిని కలిశానని బాలిక ఫిర్యాదు చేసింది. అలా క్రమంగా ప్రేమించుకున్నామని చెప్పింది. ఆ తరువాత ఒకరి ఇంటికి మరొకరు వెళ్తుండేవారు. తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో నిందితుడు తనపై అత్యాచారం చేశాడని ఆరోపించింది.
అప్పటినుంచి తనతో సన్నిహిత సంబంధాన్ని పెట్టుకున్నాడు. తన అనుమతి లేకుండానే తనతో శారీరక సంబంధం పెట్టుకున్నాడని వాపోయింది. కానీ, ఆమె అతడిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.ఈ ఏడాది జూన్‌లో ఇద్దరి మధ్య సంబంధం దెబ్బతినేసరికి బాధితురాలు తనపై అత్యాచారం చేశాడంటూ పోక్సో చట్టం కింద ఫిర్యాదు చేసింది.
తన ఫిర్యాదులో బాధితురాలు.. తమ సన్నిహితంగా ఉన్న ఫొటోలను తన తల్లికి పంపించాడని పేర్కొంది. ఈ ఫొటోలను తమ కుటుంబ సభ్యులకు పంపుతానని బెదిరించాడని ఫిర్యాదులో ఆరోపించింది. ఈ కేసులో ఇరువురి మధ్య తొందరపాటు సంబంధంపై కోర్టు పరిశీలించి అనంతరం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది..