అందమైన అమ్మాయిలతో ట్రాప్ : విశాఖలో ఫేక్ డేటింగ్ వెబ్‌సైట్ కలకలం

  • Published By: madhu ,Published On : October 26, 2019 / 05:10 AM IST
అందమైన అమ్మాయిలతో ట్రాప్ : విశాఖలో ఫేక్ డేటింగ్ వెబ్‌సైట్ కలకలం

Updated On : October 26, 2019 / 5:10 AM IST

సాగర తీర నగరం విశాఖలో ఫేక్ డేటింగ్ వెబ్‌సైట్ కలకలం రేపింది. అందమైన అమ్మాయిలతో వలపన్ని ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టురట్టయ్యింది. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు.. పక్కా సమాచారంతో నిందితుల్ని అరెస్ట్ చేశారు.

కొద్దిరోజులుగా కోల్‌కతా కేంద్రంగా హనీట్రాప్ దందా కొనసాగుతోంది. ఫేక్ డేటింగ్ వెబ్‌సైట్లతో కిలాడి గ్యాంగ్ ట్రాప్ చేస్తోంది. అందమైన అమ్మాయిల ఫోటోలు పెట్టి ఆఫర్లతో ట్రాప్ చేస్తున్నారు. అమ్మాయిల ఫొటోలు, ఆఫర్లు చూసి కొంతమంది ట్రాప్‌లో పడ్డారు. లక్షల రూపాయలు పోగొట్టుకున్నారు. ఈ కిలాడి గ్యాంగ్ బాధితులు దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నట్లు తేలింది.

ఈ గ్యాంగ్.. విశాఖలో ఒకరి నుంచి 18లక్షల రూపాయలు, మరొకరి నుంచి 3లక్షల రూపాయలు వసూలు చేసింది. డబ్బు పోగొట్టుకున్న బాధితులు మోసపోయామని విశాఖ పోలీసులను ఆశ్రయించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఈ దందాపై కూపీ లాగారు. పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా కేంద్రంగా ఈ వ్యవహారం సాగుతున్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లారు. స్థానిక పోలీసుల సహకారంతో నిందితులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 24మంది టెలికాలర్లు సహా 27మందిని అరెస్ట్ చేశారు. మూడు ల్యాప్‌టాప్‌లు, 40 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 

ఓస్లాం ఐటీ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా ఫేక్ డేటింగ్ యాప్‌తో అమాయకుల్ని ట్రాప్ చేస్తున్నట్లు తేలింది. కొంతమంది అమ్మాయిలను ఐటీ ఉద్యోగులని చెప్పి జాబ్‌లో చేర్చారు. వారితో అమాయకులకు ఫోన్లు చేయించి ట్రాప్ చేసి డబ్బు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. దేశవ్యాప్తంగా ఇలా చాలామందిని బురిడీ కొట్టించినట్లు తేలింది. ఈ క్రమంలోనే కిలాడి గ్యాంగ్ విశాఖ వాసులను టార్గెట్ చేసింది.
Read More : హైటెక్ ముఠాలు : డెబిట్ కార్డుల డేటా తస్కరణ