మిస్టరీ బ్రేక్: చనిపోయిన వ్యక్తే.. పది లక్షలు డ్రా చేశాడా?
రెండు నెలల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందిన 57ఏళ్ల వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి ఉన్నట్టుండి రూ.10 లక్షలు మాయమయ్యాయి. చనిపోయిన వ్యక్తే తన ఖాతాలోని డబ్బులను తీస్తున్నాడా? లేదా ఎవరైనా ఇదంతా చేస్తున్నారా? తెలియక మృతుడి కుటుంబ సభ్యులు షాక్ అవుతున్నారు.

రెండు నెలల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందిన 57ఏళ్ల వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి ఉన్నట్టుండి రూ.10 లక్షలు మాయమయ్యాయి. చనిపోయిన వ్యక్తే తన ఖాతాలోని డబ్బులను తీస్తున్నాడా? లేదా ఎవరైనా ఇదంతా చేస్తున్నారా? తెలియక మృతుడి కుటుంబ సభ్యులు షాక్ అవుతున్నారు.
రెండు నెలల క్రితం అనుమానాస్పదంగా మృతిచెందిన 57 ఏళ్ల వ్యక్తి బ్యాంకు అకౌంట్ నుంచి ఉన్నట్టుండి రూ.10 లక్షలు మాయమయ్యాయి. చనిపోయిన వ్యక్తే తన ఖాతాలోని డబ్బులను తీస్తున్నాడా? లేదా ఎవరైనా ఇదంతా చేస్తున్నారా? తెలియక మృతుడి కుటుంబ సభ్యులు షాక్ అవుతున్నారు. మృతుడి కుటుంబానికి డబ్బులు విత్ డ్రా చేసినట్టు ఎస్ఎంఎస్ అలర్ట్ లు రావడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. చనిపోయిన వ్యక్తి ఫోన్ నెంబర్ ను అతడి సోదరుడే వాడుతున్నప్పటికీ.. అకౌంట్ లో రూ. 10 లక్షలు ఎవరూ మాయం చేశారో తెలియక తలలు పట్టుకున్నారు.
ఇదంతా దెయ్యం పనేనా..?
కొంప తీసి చనిపోయిన రాల్ప్ కౌంటిన్హో.. దెయ్యంలా మారి డబ్బులు ఏటీఎం నుంచి డ్రా చేస్తున్నాడంటే నమ్మే పరిస్థితి లేదు. అనుమానం వచ్చిన మృతుడి సోదరుడు గోవండి పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయడంతో అసలు మిస్టరీ బయటపడింది. పోలీసులు చనిపోయిన రాల్ప్ ప్లాట్ కు వెళ్లి అక్కడి సీసీ కెమెరాలోని ఫుటేజిని పరిశీలించగా.. అందులో రాల్ప్ డెబిట్-క్రెడిట్ కార్డులను దొంగలిస్తున్న వ్యక్తిని గుర్తించారు. రాల్ప్ చనిపోయిన అనంతరం అతడి గదిని శుభ్రపరుస్తున్న సమయంలో ఈ కార్డులను దొంగలించినట్టు పోలీసులు కనిపెట్టారు. ఆ వ్యక్తి రెహ్మాన్ ఇస్మాయిల్ మెమెన్ (39)గా గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నేవీ కెప్టెన్ గా పనిచేసిన రాల్ప్ (57)కి పెళ్లికాలేదు. చెంబూరులో నివసిస్తున్నాడు. గత జూన్ 2న ప్లాట్ లో అనుమానస్పదంగా మృతిచెందాడు.
ప్లాట్ లో రాల్ప్ డెడ్ బాడీ..
గదిలో నుంచి ఏదో వాసన రావడంతో పక్కంటి వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గది తెరిచి చూడగా అందులో రాల్ప్ మృతదేహం కనిపించింది. సోదరుడు రిచార్డ్ (62) రాల్ప్ అంత్యక్రియలను నిర్వహించారు. రాల్ప్ ప్లాట్ కు క్లీన్ చేసేందుకు నలుగురిని పంపాడు. అయితే ఆ గదిలో ఎలాంటి మొబైల్ కనిపించలేదని రిచార్డ్ పోలీసులకు తెలిపాడు. గత ఆగస్టులో కెనడా నుంచి రాల్ప్ సోదరుడు రోనాల్డ్ కౌంటిన్హో (52) ముంబైకి వచ్చాడు. ఈ సందర్భంగా చనిపోయిన రాల్ప్ ఫోన్ నెంబర్ ను తీసుకొని వాడుతున్నాడు. అదే నెంబర్ పై కొత్త సిమ్ కార్డు తీసుకున్నాడు.
కొత్త సిమ్ యాక్టివ్ కాగానే..
ఆ సిమ్ కార్డు యాక్టివేట్ కాగానే ఎస్ఎంఎస్ లు ఫోన్ కు వచ్చాయి. మొత్తం రూ. 10 లక్షల 50వేలు విత్ డ్రా అయినట్టుగా మెసేజ్ లు వచ్చాయి. అది చూసి రాల్ప్ కుటుంబం ఒక్కసారిగా షాక్ అయింది. దీంతో రాల్ప్ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్ చేయించారు. మరోసారి నిందితుడు ఏటీఎం కార్డు ద్వారా డబ్బులను డ్రా చేసేందుకు యత్నించి విఫలమయ్యాడు. కార్డులు కొట్టేసిన రెహ్మాన్ పై నిఘా పెట్టిన పోలీసులు అతడే దొంగగా గుర్తించి పట్టుకున్నారు. జనవరి 5 వరకు కస్టడీకి తరలించారు. రెహ్మాన్ వెనుక ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.