మార్కెట్‌లో భారీ బాంబు పేలుడు… 40 మంది దుర్మరణం

  • Published By: sreehari ,Published On : April 29, 2020 / 07:48 AM IST
మార్కెట్‌లో భారీ బాంబు పేలుడు… 40 మంది దుర్మరణం

Updated On : April 29, 2020 / 7:48 AM IST

ఉత్తర సిరియాలో బాంబు పేలి 40 మంది దుర్మరణం చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 11 మంది చిన్నారులు కూడా ఉన్నారు.  జనసంద్రం కలిగిన ప్రాంతంలో బాంబు పేల్చారు. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.  బాంబు పేలుడుతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అఫ్రిన్ పట్టణంలో జరిగినట్లు టర్కీ రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. సిరియా కుర్దిష్ దళాలే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు టర్కీ ఆరోపించింది. బాంబు దాడిని అమెరికా తీవ్రంగా ఖండించింది. 

రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా షాపింగ్ చేసేందుకు వచ్చిన వారిని టార్గెట్ చేసుకొని పేలుడుకు పాల్పడినట్లు తెలుస్తోంది. కుర్దిష్ మిలిటెంట్లతో సంబంధం ఉన్న వైపీజీ ఉగ్రవాద గ్రూపు ఉత్తర సిరియాలో సైనిక చర్యకు దిగినట్లు కనిపిస్తోంది.