హైదరాబాద్‌ సిటీలో కలకలం : పట్టపగలు రూ.70లక్షల బ్యాంక్ డబ్బు దోపిడీ

హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ చోరీ జరిగింది. దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టేందుకు ఉపయోగించే వాహనం నుంచి రూ.70లక్షలు దోచుకెళ్లారు. సిబ్బంది

  • Published By: veegamteam ,Published On : May 7, 2019 / 07:43 AM IST
హైదరాబాద్‌ సిటీలో కలకలం : పట్టపగలు రూ.70లక్షల బ్యాంక్ డబ్బు దోపిడీ

Updated On : May 7, 2019 / 7:43 AM IST

హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ చోరీ జరిగింది. దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టేందుకు ఉపయోగించే వాహనం నుంచి రూ.70లక్షలు దోచుకెళ్లారు. సిబ్బంది

హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ చోరీ జరిగింది. పట్టపగలే దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బ్యాంకు డబ్బుని దోచుకెళ్లారు. ఏటీఎంలలో డబ్బులు పెట్టేందుకు ఉపయోగించే వాహనం నుంచి రూ.70లక్షలు అపహరించారు. సిబ్బంది దృష్టి మళ్లించి చోరీకి పాల్పడ్డారు. వనస్థలిపురంలోని యాక్సిస్ బ్యాంక్ దగ్గర మంగళవారం (మే 7,2019) మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఏటీఎంలో క్యాష్ పెట్టడానికి సిబ్బంది సిద్ధమవుతున్న   సమయంలో ఈ దోపిడీ జరిగింది. రూ.70లక్షలు దోచుకెళ్లిన ఘటన సంచలనంగా మారింది.

రంగంలోకి దిగిన పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. దోపిడీ దొంగలు ఎంతమంది వచ్చారు, ఎటు వైపు వెళ్లారు, అసలేం జరిగింది అనే వివరాలు ఆరా తీస్తున్నారు. పోలీసులు  సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తున్నారు. దొంగలు పథకం ప్రకారం రెక్కీ చేశాకే ఈ దోపిడీకి పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వాహనంలో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బు పెట్టేందుకు వారు సిద్ధమవుతున్నారు. వాహనం నుంచి డబ్బు తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇంతలో.. అక్కడికి వచ్చిన ఓ వృద్దుడు.. వాహనం  ముందు డబ్బులు పడ్డాయని సిబ్బందికి చెప్పాడు. దీంతో కంగారు పడిన వారు కారులో డబ్బుల డబ్బాని వదిలి ముందుకెళ్లారు. ఇంతలో వెనకాల నుంచి వచ్చిన వ్యక్తి కారులో ఉన్న డబ్బుల పెట్టెని తీసుకుని పారిపోయాడు. వనస్థలిపురంలోని యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలో డబ్బు నింపేందుకు సిబ్బంది వచ్చారు. ప్రత్యేక పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి. క్లూస్ టీమ్ లతో నిందితుల కోసం గాలిస్తున్నారు. సిబ్బంది నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణం అని తెలుస్తోంది.