Husband Eloped : పెళ్లైన నాలుగు నెలలకే ఇల్లు వదిలి పారిపోయిన భర్త

పెళ్లైన నాలుగు నెలలకే భార్య అంటే ఇష్టం లేదని చెప్పి భర్త ఇల్లు వదిలి పారిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

Husband Eloped : పెళ్లైన నాలుగు నెలలకే ఇల్లు వదిలి పారిపోయిన భర్త

Husband Missing

Updated On : October 18, 2021 / 11:15 AM IST

Husband Eloped : పెళ్లైన నాలుగు నెలలకే భార్య అంటే ఇష్టం లేదని చెప్పి భర్త ఇల్లు వదిలి పారిపోయిన ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.

షాపూర్‌నగర్‌కు  చెందిన  హరిక(19), నవీన్ కుమార్ అనే  యువకుడికి నాలుగు నెలల క్రితం పెద్దల సమక్షంలో పెళ్లి జరిగింది. ఇద్దరూ జీడిమెట్ల పోలీసు స్టేషన్  పరిధిలో కాపురం పెట్టారు.  నవీన్ కుమార్ ఎస్ ఆర్ నగర్ లోని   న్యూఎరా లేడీస్ టైలర్స్ లో   ఫ్యాషన్ డిజైనర్‌గా పని చేస్తున్నాడు.

కాగా…. దసరా పండుగ సందర్భంగా ఈనెల 15వ తేదీ ఉదయం గం. 10-30కి భార్యను పుట్టింటికి   పంపించేందుకు బస్సు ఎక్కించాడు నవీన్ కుమార్.   తెలిసిన వారి దగ్గర నుంచి డబ్బులు రావాలి…. అవి తీసుకుని ఇంటికి వస్తానని ఆమెతో చెప్పాడు.  సాయంత్రం 4గంటలైనా నవీన్ కుమార్ రాకపోయే సరికి భార్య హారిక భర్తకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది.

అయితే 16వ తేదీ  ఉదయం 10 గంటల సమయంలో నవీన్ ఫోన్ నుంచి హారిక ఫోన్ కు ఒక మెసేజ్ వచ్చింది.  నీ బ్యాగ్ లో లెటర్ ఉంది తీసి చదువుకో అని అందులో సారాంశం. దీంతో బ్యాగ్ తెరిచి అందులో భర్త పెట్టిన లెటర్ చూసింది హారిక.

Also Read : Husband Kills Wife : ప్రేమించి పెళ్లి…. అంతలోనే భార్య దారుణ హత్య

” నువ్వంటే నాకు ఇష్టంలేదు… అందుకే ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నాను”  అని రాసి ఉంది.  ఆందోళన చెందిన భార్య, భర్త ఆచూకి కోసం అతని తమ్ముడు, చెల్లెలికి ఫోన్ చేయగా  తమ వద్దకు రాలేదని సమాధానం చెప్పారు.  దీంతో ఆమె ఆదివారం నాడు జీడిమెట్ల  పోలీసులకు  భర్త ఆచూకి గురించి  ఫిర్యాదు చేసింది.  కేసు నమోదు చేసుకున్న  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.