Maharashtra: భార్యపై సామూహిక అత్యాచారం చేయించిన భర్త.. అర్థరాత్రి 15 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి..

మహారాష్ట్రలో పాశవిక ఘటన చోటు చేసుకుంది. తాళికట్టి అండగా ఉంటాడనుకున్న భర్త మృగంలా మారాడు.. తన పొలం యాజమాని, అతని సోదరుడితో భార్యపై అత్యాచారం చేయించాడు..

Maharashtra: భార్యపై సామూహిక అత్యాచారం చేయించిన భర్త.. అర్థరాత్రి 15 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి..

Gang Rape

Updated On : April 18, 2022 / 1:30 PM IST

Maharashtra: మహారాష్ట్రలో పాశవిక ఘటన చోటు చేసుకుంది. తాళికట్టి అండగా ఉంటాడనుకున్న భర్త మృగంలా మారాడు.. తన పొలం యాజమాని, అతని సోదరుడితో భార్యపై అత్యాచారం చేయించాడు. ఈ దారుణమైన ఘటన మహారాష్ట్రలోని ఔసా తాలూకా సారోలా వద్ద చోటుచేసుకుంది. మహారాష్ట్రలోని నిలంగా ప్రాంతానికి చెందిన 33ఏళ్ల మహిళ తన భర్తతో కలిసి సోరాలా రోడ్ వద్ద వ్యవసాయ క్షేత్రంలో నివాసం ఉంటోంది. కొద్దికాలంగా వారి మధ్య విబేధాలు తలెత్తాయి. పలుసార్లు భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Wife Gang Raped : దారుణం.. స్నేహితులతో కలిసి భార్యను గ్యాంగ్ రేప్ చేసిన భర్త

భర్త వేధింపులు తాళలేక ఆమె తన తల్లివద్దకు వెళ్లిపోయింది. కొద్దిరోజుల తరువాత తల్లి సర్దిచెప్పి భర్త దగ్గరకు పంపించింది. అయినా భార్యభర్తల మధ్య విబేధాలు కొనసాగాయి. ఈనెల 9న మరోసారి ఇరువురి మధ్య గొడవ జరిగింది. పైశాచికంగా ఆలోచించిన భర్త తప్పుడు పనికి పూనుకున్నాడు. తన పొలం యాజమాని, అతడి తమ్ముడిని పొలంవద్దకు పిలిపించాడు. తన భార్యపై అత్యాచారం చేయాలని ప్రోత్సహించాడు. భార్యభర్తలకు సర్దిచెప్పాల్సిన పొలం యాజమాని, అతని తమ్ముడు కామాందులుగా మారి భర్త కళ్లెదుటే మహిళపై అత్యాచారంకు పాల్పడ్డాడు.

Woman Gang Raped : హైదరాబాద్‌లో దారుణం.. ఆటో ఎక్కిన మహిళపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్

ఘటన అనంతరం అర్థరాత్రి సమయంలో మహిళ 15 కి.మీ కాలినడక ప్రయాణించి పోలీస్ స్టేషన్‌లో తనకు జరిగిన అన్యాయంపై ఫిర్యాదు చేసింది. పోలీసులు పట్టించుకోకపోవటంతో నేరుగా ఎస్పీని కలిసి తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని తెలిపింది. కేసు నమోదుచేసి నిందితులను అరెస్టు చేయాలని ఎస్పీ ఆదేశించడంతో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఘనటపై దర్యాప్తు ప్రారంభించారు.