Husband kill wife : ఆడపిల్లలే పుడుతుండటంతో భార్యను హత్య చేసిన భర్త

భార్య ఆడపిల్లల్నే కంటోందని ఆమెను హత్య చేసిన కిరాతక భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.

Husband kill wife : ఆడపిల్లలే పుడుతుండటంతో భార్యను హత్య చేసిన భర్త

Husband Killed Wife

Updated On : April 7, 2021 / 11:53 AM IST

Husband killed wife : భార్య ఆడపిల్లల్నే కంటోందని ఆమెను హత్య చేసిన కిరాతక భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నార్సింగి మండలం జప్తిశివనూర్, కాశ్య తండాకు చెందిన జహీరాబి అనే మహిళ మార్చి 31న నిద్రలోనే కన్ను మూసింది. తన కూతురుని అల్లుడే హతమార్చాడని ఆరోపిస్తూ.. ఆమె తల్లి హైదర్ బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదర్ బీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసు విచారణలో భార్యను చంపింది తానేనని భర్త బషీర్ అంగీకరించాడు.

బషీర్ జహీరాబి దంపతులకు నలుగురు కుమార్తెలు పుట్టారు. ఒక కుమార్తె మరణించింది. మగపిల్లవాడి కోసంమరో పెళ్ళిచేసుకుంటానని భార్యను వేధించేవాడు. పలు మార్లు పెద్దలవద్ద పంచాయతీ జరిగినా ఎవ్వరి మాట వినకుండా మరో విహాహం చేసుకున్నాడు. ఒకే ఇంట్లో ఇద్దరు భార్యలతో కాపురం పెట్టాడు.

దీంతో జహీరాబీ తో తరచూ గొడవలు పడేవాడు. ఎలాగైనాభార్యను వదిలించుకోవాలనుకున్నాడు. మార్చి 31వ తేదీన ఇంట్లో నిద్రిస్తున్న భార్యను హత్య చేశాడు. జహీరాబీ తల్లి హైదర్ బీ ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వారం  రోజుల్లోనే కేసును చేధించగలిగారు.