Husband Murdered wife lover : తన భార్యతో సహజీవనం చేస్తున్నాడని….
కలహాల కారణంగా విడిపోయిన తన భార్యతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని, భర్త బండరాయితో కొట్టి హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల మోజులో నేరాలు జరుగుతున్నా ప్రజలు వీటిపై మోజు పెంచకుంటూనే ఉన్నారు.

Husband Murdered Wife Lover
Extramarital affair : కలహాల కారణంగా విడిపోయిన తన భార్యతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని, భర్త బండరాయితో కొట్టి హతమార్చిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల మోజులో నేరాలు జరుగుతున్నా ప్రజలు వీటిపై మోజు పెంచకుంటూనే ఉన్నారు.
చిత్తూరు జిల్లా దిగువలంభంవారి పల్లెకు చెందిన వెంకటరమణ కుమార్తె ఆదిలక్ష్మికి … పుంగనూరు మండలం ఆరడిగుంట గ్రామానికి చెందిన మునెప్ప కుమారుడు అర్జున్ తో 20 ఏళ్ళ క్రితం వివాహం అయ్యింది. సజావుగా సాగుతున్న వీరి కాపురంలో నాలుగేళ్ల క్రితం కలహాలు చోటు చేసుకున్నాయి. దీంతో భార్యా భర్తలిద్దరూ విడిపోయి వేరువేరుగా నివసిస్తున్నారు.
ఈక్రమంలో ఆదిలక్ష్మికి కర్ణాటక రాష్ట్రం శ్రీనివాసపురం తాలూకాకు చెందిన శ్రీనివాసులు అలియాస్ అంజప్ప(41)తో పరిచయం ఏర్పడింది. పరిచయం మరింతగా పెరిగి సహజీవనం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి దిగువలంభం వారి పల్లెలో ఇల్లు తీసుకుని సహజీవనం చేయసాగారు.
ఈవిషయం ఆదిలక్ష్మి భర్త అర్జున్ కు తెలిసింది. ఏప్రిల్22, గురువారం రాత్రి ఆదిలక్ష్మి ఇంటికి వెళ్లాడు. అక్కడ నిద్రలో ఉన్న అంజప్పపై బండరాయితో కొట్టి పారిపోయాడు. అర్జున్ చర్యలకు భయపడిన ఆదిలక్ష్మి గట్టిగా కేకలు వేసింది. ఆమె కేకలు విన్నగ్రామస్తులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన అంజప్పను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రాధమిక చికిత్స చేసిన అనంతరం మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తీసుకు వెళ్లమని వైద్యులు సూచించారు. అయితే తిరుపతి తరలిస్తుండగా మార్గమధ్యలోనే అంజప్ప కన్ను మూశాడు. మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వాసు పత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.