శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి

శ్రీలంక పేలుళ్లలో హైదరాబాద్ వాసి మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తి మణికొండకు చెందిన మాకినేని శ్రీనివాసబాబుగా తెలుస్తోంది. అయితే పేలుళ్లు జరిగే సమయానికి సినీ నటుడు శివాజీ రాజా కొలంబోలో ఉండాల్సింది. చివరి నిమిషంలో శ్రీలంక టూర్ వాయిదా వేసుకున్నారు. దీంతో అతనికి పెను ప్రమాదం తప్పింది.
శివాజీ రాజా అతని ఫ్రెండ్ మాకినేని శ్రీనివాసబాబు కలిసి శ్రీలంక వెళ్లాల్సి ఉంది. ఇంట్లో శుభకార్యం ఉండటంతో శివాజీ రాజా వెళ్లలేదు. మాకినేని శ్రీనివాస బాబు అతని కజిన్ తో కలిసి శ్రీలంకకు వెళ్లారు. శ్రీలంకలోని కొలంబోలో నిన్న జరిగిన పేలుళ్లలో శ్రీనివాస బాబుకు తీవ్ర గాయాలు కాగా అతని కజిన్ మృతి చెందారు. అతని మృతిపై శివాజీ రాజా తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. శుభకార్యం ఉండటంతో తాను వెళ్లలేదని.. ఇలా జరుగుతుందని అనుకోలేదన్నారు. ఐదుమందిమి కలిసి టూర్ ప్రోగ్రామ్ చేసుకున్నామని.. కానీ పని ఉండటంతో తాను వెళ్లలేకపోయానని చెప్పారు. మృతి వార్త, శ్రీనివాసుకు గాయాలైన వార్త ఇవాళా సాయంత్రం తనకు తెలిసిందన్నారు.