Cheating Gang Arrest : ఏటీఎం కార్డుల ద్వారా బ్యాంకులను మోసం చేస్తున్న ముఠా అరెస్ట్
హైదరాబాద్ నగరంలో డెబిట్ కార్డ్‌ల ద్వారా బ్యాంకులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా మేవాట్ గ్యాంగ్‌ను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Cops Arrested
Cheating Gang Arrest : హైదరాబాద్ నగరంలో డెబిట్ కార్డ్‌ల ద్వారా బ్యాంకులను మోసం చేస్తున్న అంతరాష్ట్ర ముఠా మేవాట్ గ్యాంగ్‌ను సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవలే నల్లకుంట, విద్యానగర్ లలో ఈ గ్యాంగ్ డెబిట్ కార్డుల ద్వారా బ్యాంకులను మోసం చేసింది. దీంతో రంగంలోకి దిగిన నల్లకుంట పోలీసులు, సౌత్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులతో కలిసి జాయింట్‌గా ఆపరేషన్ చేసి ఈగ్యాంగ్ అట కట్టించారు.
హర్యానా ముఠా నుండి 23 డెబిట్ కార్డులు సీజ్ చేశారు. ఈ ముఠాపై నాలుగు కేసులు ఉన్నాయనీ, నల్లకుంట, సైదాబాద్, వనస్థలిపురంలో కేసులు నమోదు అయ్యాయి అని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. ఈ గ్యాంగ్‌కు ప్రధాన సూత్రధారి మొహాద్ ఇక్బాల్, అన్సారీ, మహ్మద్ సలీం ను అరెస్ట్ చేశామన్నారు.
ముఠా సభ్యులు టెక్నికల్ టూల్స్ వాడి ఏ.టి.ఎం. సెంటర్‌లో టెక్నికల్ ఎర్రర్ వచ్చేలా చేస్తారనీ, టూల్స్ ఉపయోగించి కాష్ డ్రా చేసుకొని వెళ్తారనీ సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి తెలిపారు. ఈ ముఠా బ్యాంక్‌కి వెళ్లి…. ఏటీఎంలో క్యాష్ డ్రా కాలేదు అని ఫిర్యాదు చేస్తారనన్నారు.
తాము డబ్బులు డ్రా చేసేటప్పుడు ఎర్రర్ వచ్చిందని నమ్మించి బ్యాంక్‌లో నుండి మళ్లీ డబ్బులు తీసుకుంటారని పోలీసులు వివరించారు. బ్యాంక్‌ల నుండి వచ్చిన డబ్బులను ఈ ముఠా సమానంగా పంచుకుంటున్నారనీ తెలిపారు. ఈ ముఠా నుండి ఒక పెన్ కెమెరాతో పాటు 23 డెబిట్ కార్డులు, రూ.2.11 లక్షల నగదు, 3 సెల్ ఫోన్లు సీజ్ చేశారు పోలీసులు
.