ఉద్యోగాల పేరుతో మోసం 

  • Published By: chvmurthy ,Published On : April 26, 2019 / 01:04 PM IST
ఉద్యోగాల పేరుతో మోసం 

Updated On : April 26, 2019 / 1:04 PM IST

హైదరాబాద్: నిరుద్యోగులను మోసం చేసే సంస్ధల ఆగడాలకు అడ్డులేకుండా పోతోంది. పోలీసులు  ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తూనే ఉన్నా, మోసగాళ్లు నిరుద్యోగలను మోసం చేస్తూనే ఉన్నారు. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసిన ఓ సంస్ధ హైదారాబాద్ లో బోర్డు తిప్పేసింది. సికింద్రాబాద్ కార్ఖానాలో  మార్వెల్ సొల్యూషన్స్ అనే సంస్ధ నిరుద్యోగులను నిలువునా ముంచింది. ఒక్కోక్కరినుంచి 35 వేల రూపాయలు చొప్పున  సుమారు 100 మంది వద్ద సంస్ధ డబ్బులు వసూలు చేసింది.  
Also Read : ఎలక్షన్ అఫిడవిట్ : మోడీ ఆస్తులు ఎంతంటే?

డబ్బులు కట్టినా ఉద్యోగాలు చూపించక పోవటంతో  నష్టపోయామని తెలుసుకున్న నిరుద్యోగులు  కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంస్థకు చెందిన కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. మోసానికి  పాల్పడ్డ ఈసంస్థ కార్యాలయం  పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలోనే ఉండడం గమనార్హం.