Serial Killer: హైదరాబాద్ ఫిలింనగర్లో సీరియల్ కిల్లర్ అరెస్ట్.. ఒంటరిగా ఉన్న వృద్ధులే టార్గెట్
ఈ కేసులో వాసును అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Serial Killer: హైదరాబాద్ ఫిలింనగర్ లో సీరియల్ కిల్లర్ అరెస్ట్ అయ్యాడు. చెవి కమ్మల కోసం వృద్ధులను హత్య చేసిన డ్రైవర్ వాసుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 11 యాదమ్మ అనే వృద్ధురాలు మిస్సింగ్ అయ్యింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు. ఈ కేసులో వాసును అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. విచారణలో షాకింగ్ విషయాలు వెల్లడించాడు నిందితుడు వాసు. వృద్ధురాలిని నమ్మబలికి కారులో తీసుకెళ్లి నిర్మానుష్య ప్రాంతంలో హత్య చేశానని తెలిపాడు.
చెవి కమ్మల కోసమే వృద్ధురాలు యాదమ్మను హత్య చేసినట్టు ఒప్పుకున్నాడు. పోలీసుల విచారణలో జూబ్లీహిల్స్లో మరో వృద్ధురాలి హత్య ఘటన కూడా బయటపడింది. ఆమెను కూడ చెవి కమ్మల కోసమే మర్డర్ చేసినట్లు వాసు అంగీకరించాడు. నిందితుడు వాసు ఒంటరిగా ఉన్న వృద్ధులను టార్గెట్ చేస్తున్నాడని పోలీసులు తెలిపారు. హత్యల తర్వాత చెవి కమ్మలను దోచుకుని పారిపోతున్నాడు. ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ దగ్గర వృద్ధురాలి కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. నిందితుడు వాసుని కఠినంగా శిక్షంచాలని డిమాండ్ చేశారు. ఇక మరిన్ని కేసుల్లోనూ నిందితుడు వాసు పాత్రపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పక్కా ప్లాన్ ప్రకారమే.. విశాఖలో యువతి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి..
