బాలుడి రేప్ కేసులో టీచర్ కు 10 ఏళ్ల జైలుశిక్ష

  • Published By: nagamani ,Published On : June 24, 2020 / 05:37 AM IST
బాలుడి రేప్ కేసులో టీచర్ కు 10 ఏళ్ల జైలుశిక్ష

Updated On : June 24, 2020 / 5:37 AM IST

చదువుకోవటాని వచ్చిన బాలుడిపై ఓ ఉపాధ్యాయుడు లైంగిక దాడికి తెగబడ్డాడు. విద్యాబుద్ధులు చెప్పాల్సిన 32 ఏళ్ల మాస్టారు బాలుడిపై  (లైంగిక వేధింపుల చట్ట ప్రకారం బాధితుల పేరు బైటపెట్టకూడదు)చేసిన  అఘాయిత్యం కేసులో సదరు కీచక టీచర్ కు 10 సంవత్సరాల కఠినశిక్షను విధించింది ధర్మాసనం. 2015లో జరిగిన ఈ కేసుకు ఇన్నాళ్లు తీర్పునిచ్చింది కోర్టు.

వివరాల్లోకి వెళితే..హైదరాబాద్ లోని పాతబస్తీలోని బహదూర్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని కిషన్ బాగ్ లో 2015లో ఈ దారుణం జరిగింది.   మహ్మద్ మునీరొద్దీన్ అనే ఉపాధ్యాయుడి దగ్గరకు 12 సంవత్సరాల బాలుడు అరబిక్ చదువుకోవటానికి వచ్చేవాడు. అతడిపై కన్నేసిన ఆ రాక్షసుడు ఓరోజు ఆ బాలుడిపై లైంగిక దాడికి తెగబడ్డాడు. ఎవరైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలుడు భయపడి ఎవ్వరికీ చెప్పలేదు. దీన్ని అలుసుగా తీసుకున్న మహ్మద్ పలుమార్లు దాష్టీకానికి తెగబడ్డాడు.  తనపై ఏం జరిగిందో కూడా తెలియని ఆ పసివాడు..అతను పెట్టే హింసల్ని భరించీ భరించీ చివరకు తన తండ్రికి ఈ విషయాన్ని చెప్పాడు.

దీంతో తండ్రి బాలుడికి తీసుకుని బహదూర్ పురా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహ్మద్ పై పోలీసులు పోక్సో చట్టం కింద సెక్షన్ 6, భారత శిక్షాస్మృతిలోని 377,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈకేసులో ఐదు సంవత్సరాల విచారణ అనంతరం జరిగిన లైంగికదాడి కేసులో ఫోక్సో స్పెషల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో అరబిక్ టీచర్ ను దోషిగా తేలుస్తూ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి సునీతా కుంచల తీర్పుని వెలువరిస్తూ..పదేళ్ల జైలు శిక్షతో పాటు రెండు వేల రూపాయల జరిమానా విధించింది ఫోక్సో స్పెషల్ కోర్టు. పోలీసులు లైంగిక దాడికి సంబంధించిన పక్కా ఆధారాలతో కేసు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేయటంతో కోర్టు తీర్పును వెలువరించింది.

Read: నువ్వు లేక నేను లేను, టిక్ టాక్ వీడియో తీసి ప్రియుడు ఆత్మహత్య